Chandra Babu : ఇప్పుడు ఏపీలో జగన్‌పై రాయి దాడి పెద్ద చర్చనీయాంశంగా మారింది. శనివారం రాత్రి ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తెనాలిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రాసి విసిరాడు. అయితే, అది పక్కన పడింది. ఆ తర్వాత విశాఖపట్నంలోని గాజువాకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ దుండగుడు చంద్రబాబుపైకి రాయి విసిరి అక్కడ్నుంచి పరారయ్యాడు. అయితే, చంద్రబాబుకు తగలకుండా పక్కకుపడింది. ప్రజాగళం వాహనం వెనుక నుంచి రాయి విసిరి అక్కడ్నుంచి పరారు కావడంతో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఏపీలో ఎన్నికల ప్రచార సమయంలో ఇలా రాళ్ల దాడుల ఘటనలు జరుగుతుండటంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సభలో కరెంట్ పోయింది. ఎవరు బాధ్యత వహించాలి. కరెంట్ బంద్ చేసిన వారిపై, రాళ్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. జగన్ పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారు. దాడులు చేస్తే.. చూస్తూ ఉండటానికే పోలీసులు ఉన్నారా? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. జగన్ ఒకప్పుడు కోడికత్తి డ్రామా ఆడారు. బాబాయి హత్యను నా మీద నెట్టాలని ప్రయత్నించారు. విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనను అందరం ఖండించాం. పేటీఎం బ్యాచ్ కుక్కలు ఇష్టానుసారంగా మోరిగాయి. రాళ్లు నేనే వేయించినట్లు మాట్లాడారు అని చంద్రబాబు మండిపడ్డారు.
గతంలో కూడా తనపై రాళ్లు వేశారన్న చంద్రబాబు.. క్లైమోర్ మైన్స్‌కే భయపడని వ్యక్తిని రాళ్లకు భయపడతానా అని అన్నారు. మరోవైపు విజయవాడలో సీఎం జగన్ మీద జరిగిన రాళ్లదాడి తాము చేయించినట్లు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. రాళ్లు విసిరిన వారిపై చర్యల తీసుకోవాలనిడిమాండ్ చేశారు. రాళ్ల దాడులు జరుగుతుంటే పోలీసులు, నిఘావర్గాలు ఏం చేస్తున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డలి తో సొంత బాబాయిని చంపి ఆ నేరాన్ని నాపై మోపే ప్రయత్నం చేయగా, ఇప్పుడు సొంత చెల్లి రోడ్డు మీదకు వచ్చి బాబాయ్‌ని ఎందుకు చంపావ్ అని అడుగుతుంది. ముందు దానికి సమాధానం చెప్పు జగన్ అని ప్రశ్నించారు చంద్రబాబు.