Bullet Bhaskar : బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ కార్యక్రమం ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకు మంచి ర్యాంకింగ్స్‌తోపాటు పాపులారిటీ కూడా అదే రేంజ్లో ఉంటుంది. షో ద్వారా కమెడీయన్స్ చేసే కామెడీ రంజింపజేస్తుంటుంది. ఒక్కోసారి వారు చేసే కామెడీ వలన ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.తాజాగా జబర్దస్త్ కామెడీ షోలో ప్రసారం కానున్న ఓ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో ప్రభుత్వంపై సెటైర్ వేశారు బుల్లెట్ భాస్కర్. అందులో మీకు ఎంత ఫించన్ ఎంత వస్తుందంటే.. బుల్లెట్ భాస్కర్ తల్లి 2750 రూపాయలు అని సమాధానం చెప్పారు. అయితే ఇంకా పెరగదా? అని మరో క్యారెక్టర్ అడిగితే.. ఇంకా పెరగదు.. గవర్నమెంట్ మారితే పెరుగుతుంది అని బుల్లెట్ భాస్కర్ తల్లి జవాబిస్తుంది.
ఇప్పుడు ఇది వైసీపీ వర్గాలకి ఆగ్రహం తెప్పిస్తుంది. బుల్లెట్ భాస్కర్‌పై జగన్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఏపీలో వృద్ధ్యాప్య పెన్షన్ ను ఉద్దేశించి ఈ డైలాగులు ఉన్నాయంటూ నెట్టింట భారీగా ట్రోల్ చేస్తున్నారు. స్కిట్ల పేరుతో ప్రభుత్వంపై సెటైర్లు వేయడం సరికాదంటూ ఆయనకి వార్నింగ్ ఇస్తున్నారు. వైసీపీ శ్రేణుల ఆగ్రహాన్ని గుర్తించిన బుల్లెట్ భాస్కర్ క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. ‘ వైసీపీ శ్రేణులు, కార్యకర్తలందరికీ మా అమ్మ తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను. అది ఫ్లోలో అన్నదే కానీ.. ఏ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చెప్పింది కాదు అని చెప్పారు.
నేను చాలా సాధారణంగా అన్నపదం. దీని వల్ల ఎవరైనా ఫీలయినా, మనోభావాలు దెబ్బతింటే వారికి నా తల్లి తరఫున, నా తరఫున క్షమాపణలు చెబుతున్నాను. ప్రోమోలో డైలాగులు డిలీల్ చేయమని మా టీం వాళ్లకు కూడా చెప్పాను. కాబట్టి వచ్చే ఎపిసోడ్లో కూడా ఈ డైలాగులు ఉండవు. థ్యాంక్యూ. థ్యాంక్యూ సో మచ్’ అని వీడియోలో చెప్పుకొచ్చారు.ఇక రీసెంట్గా అనంత శ్రీరామ్ కూడా వైఎస్ఆర్ని విమర్శించినట్టు ప్రచారం జరగగా, ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. తను ఏ ప్రభుత్వంపై తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, అవన్నీ అవాస్తవాలు అని అన్నాడు.