Barrelakka : ప్రస్తుతం తెలంగాణాలో బర్రెలక్క పేరు తెగ మారుమ్రోగిపోతుంది.ఎన్ని డిగ్రీలు చదవినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని.. అందుకే బర్లు కాసుకుంటున్నానని వీడియో తీసి ఫేమస్ అయిన శిరీష తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి శిరీష (బర్రెలక్క) ఆమె తమ్ముడిపై కొందరు దుండగులు దాడి చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండలం వెనచర్లలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క తన మద్దతుదారులతో కలిసిఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఆమె తమ్ముడిపై దుండగులు దాడి చేశారు.
ఈ దాడిలో బర్రెలక్కకు ఎలాంటి హాని జరగలేదు. అయితే.. దాడిని తలుచుకుని బర్రెలక్క బోరున విలపించారు. తాను ఏం పాపం చేశానని ఇలా దాడులు చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంది. తన తమ్మున్ని తన కళ్ల ముందే కొట్టారని చెప్పుకొచ్చింది.తనపై దాడులు జరిగిన కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలు, యువత నుంచి కూడా ఆమెకు మద్దతు లభిస్తోంది. తాజాగా, ఆకట్టుకునేలా మేనిఫెస్టో విడుదల చేసి మరింత సంచలనంగా మారారు బర్రెలక్క. నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా. సరైన సమయంలో నోటిఫికేషన్లు వచ్చేలా నిలదీస్తా , పేదలకి ఇండ్ల నిర్మాణం కోసం కృషి చేస్తా ఆర్టికల్ 41 ప్రకారం నిరుద్యోగులకు భృతి ఇప్పిస్తా, ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు , ఉచిత విద్య, వైద్యం కోసం పాటుపడుతా , నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు – ఫ్రీ కోచింగ్, యువత ఉన్నత చదువులకు ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తానని బర్రెలక్క పేర్కొంది.
అయితే నాకు డబ్బులు పంపిస్తారని తెలిసి ఫోన్ పే బ్లాక్ చేయించారు. నాకు ఎంత మనీ వచ్చిన కూడా నా స్వార్ధం కోసం ఉపయోగించుకోను. హెల్త్ ఇష్యూస్, చదువుకోవడానికి డబ్బులు లేని వారికి తప్పక సాయపడతాను. నా అకౌంట్స్ అన్ని క్లోజ్ చేశారు. డబ్బులు వస్తే అవి ప్రజలకి సాయం చేయడానికి ఉపయోగిస్తా. రూమర్స్ మాత్రం అస్సలు నమ్మోద్దు. ఒక్కసారి ఆలోచించుకోండని బర్రెలక్క పేర్కొంది.