Balakrishna Vs Kodali Nani : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో హీట్ పెరుగుతుంది. వైసీపీ, టీడీపీలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసురుకుంటూ వార్తలలో నిలుస్తున్నారు. వైసీపీ కి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు టీడీపీ తో టచ్ లో ఉన్నారనే వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. నారా లోకేష్ పాద యాత్రలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ సైతం ఇదే వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకే అంటే 40 ఎమ్మెల్యేలు వచ్చేస్తారంటూ ఆయన చెప్పడంతో రాజకీయంగా ఏపీలో మరింత వేడి పెరిగింది. అయితే జగన్ సైకో పాలనకు చరమ గీతం పాడాలని , సీఎం జగన్ పాలనలో ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారని బాలయ్య అన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటుతో సరైన సమాధానం చెప్పకడానికి సిద్ధంగా ఉండాలని కూడా స్పష్టం చేశాడు. అయితే బాలయ్య వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలయ్య వీర తిలకం దిద్ది పంపిన అల్లుళ్ళను ఇంటికి పంపించినట్లే.. బావ, బావమరిదిలైన బాలయ్య, చంద్రబాబులను వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికి పంపుతారంటూ జోస్యం చెప్పారు. ప్రజల్లో విశ్వాసం, కార్యకర్తల్లో నమ్మకం లేని ఎమ్మెల్యేలు ఎవరైనా..? ఎంతటి నాయకులైనా.. సీఎంకు సన్నిహితులైనా..? జగన్ సీట్లువ్వరని కొడాలి నాని స్పష్టం చేశారు. విశ్వాసం లేని ఎమ్మెల్యేల కోసం ప్రభుత్వాన్ని, ప్రజల్ని పణంగా జగన్ పెట్టరని ఆయన పేర్కొన్నాడు.
![Balakrishna Vs Kodali Nani : బాలకృష్ణపై కొడాలి నాని సంచలన కామెంట్స్.. ఇప్పుడు అంతటా దీని గురించే చర్చ..! Balakrishna Vs Kodali Nani comments on each other](http://3.0.182.119/wp-content/uploads/2023/06/balakrishna-kodali-nani.jpg)
ప్రజల్లో మమేకమవుతూ, వారి అభిమానాన్ని పొందిన వారికి మాత్రమే జగన్ సీట్లు ఇస్తారన్నారు కొడాలి నాని.. అయితే ప్రజల్లో నమ్మకం లేని ఎమ్మెల్యేలను వైసీపీ పక్కన పెడుతుందని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని నాని స్పష్టం చేశారు.. తాము సీట్లు ఇవ్వని ఎమ్మెల్యేలు చంద్రబాబుతో టచ్‌లో ఉంటే తమకు వచ్చిన నష్టం ఏంటి అన్నారు. అలాంటి ఎమ్మెల్యేలను తీసుకుంటే టీడీపీకే నష్టం అన్నారు. ఇక ఎన్నికల ఏడాదిలో ప్రజలు టచ్‌లో ఉండాలి… ప్రజాదరణ కోల్పోయిన ఎమ్మెల్యేలు కాదని కొడాలి నాని వివరించారు. చంద్రబాబు గుడివాడ వచ్చినా.. బెజవాడ వచ్చినా.. ఎక్కడ తిరిగిన శ్రమ, ఆయాసం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని కూడా ఈ సందర్భంగా నాని తెలియజేశారు.