Ali Basha : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాలలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరి కొద్ది రోజులలో ఏపీ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. అయితే సినిమాల్లో పవన్ కళ్యాణ్‌తో సన్నిహితంగా ఉంటూ వచ్చిన వారిలో సీనియర్ కమెడియన్ అలీ ఒకరు. ఈ విషయాన్ని అప్పట్లో పవన్ కళ్యాణ్ సైతం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతే కాకుండా తన ప్రతీ సినిమాలో అలీ ఉండటం అనేది సెంటిమెంట్‌గా మారిందని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత పరిస్థితుల కారణంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టారు. అయితే ఆయన స్నేహితుడు అలీ మాత్రం వైసీపీలో జాయిన్ అయ్యారు.
ప్రస్తుతం ఆయన ఏపీ ఎలక్ట్రానికి మీడియా సలహాదారుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో ఎందుకు చేరలేదని ప్రశ్నించిన సందర్భంలో పవన్‌ను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. అది జన సైనికులకు ఆగ్రహం తెప్పించింది. దానికి తగ్గట్లు పవన్ కళ్యాణ్ సైతం అప్పటి నుంచి తన సినిమాల్లో అలీకి చాన్స్ ఇవ్వలేదు. అలాగని ఇద్దరూ ఏమైనా దూరంగా ఉంటున్నారా! అంటే అదేమీ లేదు. అలీ తన కుమార్తె పెళ్లికి పవన్ కళ్యాణ్‌ని ప్రత్యేకంగా కలిసి ఆహ్వానం అందించారు. ఆ పెళ్లికి కొన్ని కారణాలతో పవన్ వెళ్లలేదనుకోండి. కానీ.. ఆ సమయంలో పవన్‌తో అలీ బేటీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
![Ali Basha : పవన్ కళ్యాణ్‌కి ఎదురుగా పోటీ చేసే దమ్ము నాకు లేదు...ఆలీ కామెంట్స్.. Ali Basha interesting comments on pawan kalyan](http://3.0.182.119/wp-content/uploads/2024/02/ali-basha.jpg)
అయితే పలు సందర్భాలలో ఆలీ.. పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన రాగా, ఆ సమయంలో పవన్ గురించి ఆలీకి ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ కి ఎదురుగా పోటీలో నిలిచే సత్తా ఎవరికి లేదన్నట్టు ఓ సందర్భంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ భరత్‌తో కలిసి పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ కి పోటీగా ఎదురుగా ఎవరు పోటీ చేయలేరన్నట్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆలీ చేసిన పాత కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.