Hansika : సినీ నటి హన్సిక వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుంది. చిన్నప్పటి స్నేహితుడు సోహైల్‌ను హన్సిక ప్రేమ వివాహం చేసుకోబుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. జైపుర్‌లోని ముందోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్‌లో డిసెంబర్ 4న వీరి వివాహం జరుగనుంది. ఇప్పటికే పెళ్ళి పనులు కూడా ప్రారంభమయ్యాయి. కాగా పెళ్లికి రెండు రోజుల ముందు నుండే మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే షాపింగ్ పనులను స్టార్ట్ చేసిన హన్సిక తన పెళ్లి కోసం స్పెషల్ నగలను డిజైన్ చేయించుకొని మరి రాయల్ లుక్ లో దర్శనం ఇవ్వబోతుందట.
అంతేకాదు హన్సిక పెళ్లి చేసుకోబోయే సోహెల్ కు ఇదివరకే పెళ్లయింది. ఆశ్చర్యం ఏంటంటే సోహెల్ మొదటి భార్య ఎవరో కాదు హన్సిక బెస్ట్ ఫ్రెండ్. దీంతో ఈ పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఇదిలావుండగా పెళ్లి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. జనరల్ గా అబ్బాయిని పెళ్లి పీటల పైకి తీసుకొచ్చిన తర్వాత అమ్మాయిని తీసుకొస్తారు. కానీ హన్సిక మాత్రం మేము ఎందులోనూ తక్కువ కాదు.. మేమిద్దరం ఈక్వల్.. మా మనసులు అలాగే ఉంటాయి. మా ఆలోచనలు అలాగే ఉంటాయంటూ.. పెళ్లి మండపంలోకి ఇద్దరు ఒకేసారి ఎంటర్ అయ్యేలా ప్లాన్ చేసిందట.
అంతేకాదు హన్సిక పెళ్లి మండపంలో బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సర్ప్రైజ్ చూస్తే ఖచ్చితంగా సోహెల్ షాక్ అయిపోతాడు అని ఆమె ఫ్రెండ్స్ కి చెప్పుకోవడంతో నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. దీంతో హన్సిక పెళ్లి పనులపై నెటిజన్లు టూ మచ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు చేసుకున్న పెళ్లి పెళ్లి నే.. ఇద్దరు ఇష్టపడి చేసుకోవడం ముఖ్యం.. ఇలా ఎన్ని కోట్లు ఖర్చు చేశామా అన్నది కాదు.. ఎంత కాలం కలిసి ఉన్నామా అన్నది ఇంపార్టెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.