Nandita Raj : మారుతి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ప్రేమకథ చిత్రం ఒకటి కాగా, ఈ సినిమా హారర్ నేపథ్యంలో రూపొందింది. ఈ సినిమాలో తెలుగమ్మాయి నందిత హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతో దర్శకుడికి, హీరోకుఅలాగే హీరోయిన్ కు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా నందిత ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. అంతకు ముందుకు నీకు నాకు డ్యాష్ డ్యాష్ అనే సినిమాతో పరిచయం కాగా, తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.
ప్రేమ కథ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంది. మలయాళంలో లండన్ బ్రిడ్జ్ అనే సినిమా చేసింది నందిత. ఆ తర్వాత అన్ని తెలుగు సినిమాలే చేసింది. సుధీర్ బాబుతో కలిసి మూడు సినిమాల్లో నటించింది నందిత. చివరిగా నందిత విశ్వమిత్ర సినిమాలో కనిపించింది. ఈ సినిమా 2019లో రాగా, అలాగే ఎన్టీఆర్ నటించిన జై లవకుశ అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది నందిత. అప్పటికే కాస్త బొద్దుగా కనిపించింది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే ఇప్పుడు నందిత ఎలా ఉంది అని ఆరా తీయగా, నందిత లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నందిత ఇప్పుడు మరింత అందంగా మారింది. చూడముచ్చటైన రూపంతో మెరిసిపోతుంది ఈ భామ. అప్పటి కంటే ఇప్పుడే చాలా అందంగా ఉన్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరోసారి సన్నజాజిలా మారిపోయింది నందిత. ప్రస్తుతం ఈ అమ్మడి వయసు 28ఏళ్లు మాత్రమే . నందిత విశ్వమిత్ర సినిమా తర్వాత మరో సినిమా కమిట్ అవ్వలేదు. త్వరలోనే ఈ చిన్నదాని నుంచి ఏదైనా సినిమా అప్డేట్ వస్తుందేమోఅని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.