Thummi Plant : మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నా మనకు తెలియక పిచ్చి మొక్కలు అని భావిస్తాం. అటువంటి మొక్కలలో తుమ్మి మొక్క ఒకటి. ఈ .మ్మి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. తుమ్మి మొక్క ఇంట్లో ఉంటే ఎటువంటి వ్యాధులు రావని చెబుతూ ఉంటారు. తుమ్మి ఆకులతో కూర చేసుకుంటారు. వర్షాకాలంలో ఎక్కువగా ఈ మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం పక్షవాతంను సైతం నయం చేసే శక్తి ఉందని చెబుతారు.
శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఈ మొక్క ఆకుల రసాన్ని ఒక టీస్పూన్ తీసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. తుమ్మి ఆకులు, పువ్వులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి తాగితే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. తుమ్మి పూల రసం, తేనె సమాన భాగాలుగా కలిపి తీసుకుంటే నీరసం, అలసట తగ్గుతుంది. కాలేయ సంబంధ వ్యాధులు తగ్గుతాయి. తుమ్మి ఆకుల రసానికి కొంచెం ఉప్పు కలిపి చర్మ సమస్యలు ఉన్న ప్రదేశంలో రాస్తే తొందరగా తగ్గుతాయి.
సోరియాసిస్ సమస్యతో బాధపడుతున్న వారు తుమ్మి ఆకుల రసాన్ని రోజూ ఉదయం, సాయంత్రం చర్మానికి రాసుకుని అరగంట తర్వాత సున్నిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. ఇలా తుమ్మి ఆకులతో అనేక లాభాలు కలుగుతాయి. కనుక ఇకపై ఈ మొక్క కనిపిస్తే పిచ్చి మొక్క అనుకోకండి. ఇంటికి తెచ్చుకోండి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.