బిచ్చగాడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి సైతం దగ్గరైన హీరో విజయ్ ఆంటోని. ఇటీవల ఈ తమిళ్ హీరో ని పిచ్చైకారన్ 2 చిత్రీకరణలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. తాను స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ మలేషియాలోని లంకావి అనే దీవిలో జరుగుతుంది. ఈ క్రమంలోనే జెట్ స్కై వాహనంలో వెళ్లే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలోనే విజయ్ ప్రయాణిస్తున్న బోట్.. కెమెరాలు ఉన్న పడవను ఢీకొట్టింది. దీంతో విజయ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయని.. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది.
ప్రస్తుతం విజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయన పరిస్థితి విషమమంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి స్పందించాయి సన్నిహిత వర్గాలు. విజయ్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆయన సినిమా పనులు చేసుకుంటున్నారని తెలిపారు. కానీ, ఇప్పుడు వినిపిస్తున్న విషయం ఏంటంటే.. విజయ్ ఆంటోనీ కోమాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్లే కోమాలోకి వెళ్లారంటూ స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
నిన్నటి వరకు విజయ్ ఆంటోనీ బాగానే ఉన్నాడని చెప్పి ఇప్పుడు కోమాలోకి వెళ్లాడని చెప్తుండటంతో అతని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. విజయ్ నటిస్తున్న బిచ్చగాడు 2 మొదలుకుని.. కొలై, రథం, మజై పిడికత మనితన్, వల్లి మాయల్ వంటి సినిమాలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. విజయ్ ఆంటోనీ కోమాలోకి వెళ్లాడంటూ వస్తున్న ప్రతి ఒక్క తెలుగు అభిమాని ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.