Kalyaan Dhev : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొంత కాలంగా కళ్యాణ్ దేవ్‌కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇద్దరు విడాకులు తీసుకున్నారని కొందరు చెప్పుకొస్తున్నారు. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్‌లోని సంఘటనలతోనే ఎక్కువగా వైరల్ అయ్యాయో మనం చూశాం. కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి, కిన్నెరసాని సినిమాలు ఎప్పుడు వచ్చాయ్.. ఎప్పుడు వెళ్లాయ్ అన్న సంగతి కూడా మనకు తెలియదు. శ్రీజతో విడాకుల రూమర్లు కళ్యాణ్ దేవ్‌ను మరింతగా ఫేమస్ చేసాయి. అయితే కళ్యాణ్ దేవ్ ఇటీవల ఆసక్తికన పోస్ట్‌లు పెడుతూ వార్తలలో నిలుస్తున్నాడు.
రీసెంట్‌గా కళ్యాణ్ షేర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అయ్యింది. ఓపికగా ఉండండి.. అన్ని ప్రార్ధనలకు సమాధానం దొరుకుతుంది అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన వారంతా కళ్యాణ్ ఎందుకు అంత డెప్త్ ఉన్న పోస్ట్ పెట్టాడా అని ఆరాలు తీశారు. ఇక తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా మరో ఆసక్తికర పోస్ట్ చేశాడు కళ్యాణ్. ” ఈ 2022 ఏడాది చాలా నేర్చుకున్నాను. సహనం.. మెరుగుపరుచుకోవడం.. అవకాశాలు తీసుకోవడం.. రిస్క్ తీసుకోవడం.. నా తప్పుల నుంచి నేర్చుకోవడం.. వదిలిపెట్టడం.. ఇతరులను క్షమించడం.. నాతో నేను ఎక్కువగా గడపడం ఇలా ఎన్నో నేర్చుకున్నాను.
నా ఈ ప్రయాణంలో ఉండి.. నన్ను నేను మార్చుకునేలా సాయపడ్డ ప్రతీ ఒక్కరికీ ధన్యావాదలు. నా కష్టకాలంలో భుజాన్ని అందించిన వారికి థాంక్స్. మీ అందరి ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ముఖ్యమైనది ఎంటంటే.. ప్రయత్నించడం… ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దూ.. మీ అందరికీ ప్రేమ, ఆరోగ్యం, ఆనందం, సాహసం, విజయం, మీరు కోరుకునేది ప్రతిదీ ఉండాలని కోరుకుంటూ ఈకొత్త సంవత్సరం శుభాకాంక్షలు ” అంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు ఆయన చేసిన ఈ పోస్ట్ వెనక అర్థం ఏమై ఉంటుందా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్నారు.