Sr NTR : దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సినీ నటుడు ఎన్టీ రామారావు గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలు,రాజకీయాలతో ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్.. సినిమా, రాజకీయ రంగాల్లో ఓ వెలుగు వెలిగారు. అయితే తన జీవితంలోని చివరి ఘడియల్లో మాత్రం చాలా దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారు. సొంత వాళ్లే తిరుగుబావుటా ఎగరేసి.. అత్యంత అవమానకర రీతిలో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించి వేయడం చాలా మందిని బాధించింది.. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసేందుకు ప్రత్యర్థి వర్గం సాకుగా చూపించిన ఏకైక వ్యక్తి.. లక్ష్మీపార్వతి..
ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన జీవితంలోకి వచ్చిన లక్ష్మీపార్వతి.. కడవరకూ ఆయన వెన్నంటే ఉన్నారు. 63 సంవత్సరాల వయసులో లక్ష్మీపార్వతిని రెండో వివాహం చేసుకోవడం అప్పట్లో వివాదాస్పదమైంది. అయితే ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని రెండో వివాహం చేసుకోవాలని అనుకోగా, దాని కన్నా ముందుగా స్టార్ హీరోయిన్ అయిన కృష్ణకుమారిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నారట. బసవతారకంగారు బ్రతికి ఉన్నప్పుడే ఎన్టీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారట. ఈ వ్యవహారం దాదాపు పెళ్లి వరకు వెళ్లిందట. కానీ అనూహ్యంగా విడిపోవడం జరిగింది. ఒక సందర్భంలో కృష్ణకుమారి చెల్లెలు షావుకారు జానకి ఈ విషయాలను బయటపెట్టారు.
కృష్ణ కుమారి తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న ఎన్టీఆర్ ని నేను నిలదీశానని, ఆయనని తిట్టానని ప్రచారం జరిగింది. ఇందులో ఏ మాత్రం నిజం లేదని, ఎన్టీఆర్ అంటే నాకు చాలా గౌరవం ఉండేదని, అంతేకాకుండా ఆయన కూడా నన్ను అభిమానించే వారిని చెప్పుకొచ్చింది. అయితే ఎన్టీఆర్ కృష్ణ కుమారి వ్యవహరం పెళ్లి వరకు వెళ్లిన విషయం నిజమే కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో అది ఆగిపోయిందని అని షావుకారు జానకి చెప్పుకొచ్చింది. ఈ వేదనతో కృష్ణకుమారి చాలా కృంగిపోయిందని దీనివల్ల కెరియర్ చాలా డల్ అయిందని తెలియజేసింది. ఆ తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని కృష్ణకుమారి జీవితంలో సెట్ అయిందని ఆమె పేర్కొంది.