Upasana : మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ 2012లో ఉపాసనని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం జరిగి పదేళ్లు అవుతున్నప్పటికీ ఇంకా పిల్లలు ప్లాన్ చేసుకోలేదు. ఎప్పుడు పిల్లలు కంటారంటూ రామ్ చరణ్, ఉపాసనలకి అనేక సార్లు ప్రశ్నలు ఎదురుయ్యాయి. ఆ సమయంలో వీరు తమదైన శైలిలో సమాధానం ఇచ్చి ఎస్పేప్ అయ్యారు. అయితే రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడన్న విషయాన్ని ఇటీవల చిరంజీవి ప్రకటించడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ప్రెగ్నెన్సీని ప్రకటించిన తర్వాత ఉపాసన పుట్టింటికి వెళ్లగా, అక్కడ అందరితో ఆమె సరదగా గడుపుతూ.. వారి ఆశీస్సులు కూడా తీసుకుంది.
సరోగసీ ద్వారానే ఉపాసన కొణిదెల బిడ్డకు జన్మనివ్వనుందంటూ నెట్టింట వైరల్ కాగా,ఈ వివాద వార్తలకు ఇటు రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు కానీ.. అటు మెగా క్యాంప్ కానీ ఎక్కడా రియాక్ట్ కాలేదు. సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. అయితే కొన్నిసార్లు మాటలు కంటే చేతలు చాలా బలంగా ఉంటాయి కాబట్టి అలాంటి ఉపాసన తన బేబి బంప్ పిక్స్ షేర్ చేసి అందరి నోళ్లు మూయించేసింది. ఉపాసన కజిన్ వెడ్డింగ్ కోసం చరణ్ దంపతులు థాయ్ లాండ్ కు వెళ్లారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలలో ఉపాసన బేబీ బంప్ తో కనిపిస్తోంది. ఈ పిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఫొటోలలో ఉపాసన తల్లిదండ్రులు కూడా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఉపాసన బేబి బంప్ పిక్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. . ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ చిత్రంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. షూటింగ్ మధ్య దొరికిన గ్యాప్‌లో చెర్రీ హాలీడే ఎంజాయ్ చేస్తున్నారు. ట్రిపులార్‌తో సంచలన విజయాన్ని అందుకున్న రామ్‌చరణ్ తన తర్వాత చిత్రాన్ని కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇక బుచ్చిబాబుతో ఓ చిత్రాన్ని చేయబోతున్న ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.