Samantha : ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన అందాల ముద్దుగుమ్మ సమంత. ఎంతో సంతోషంగా సరదాగా ఉండే సమంత కొద్ది రోజులుగా సమంత మయోసైటిస్ అనే కండరాల సమస్యతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. కొద్ది రోజులుగా ఆమె ఆరోగ్య సమస్యపై రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమంత ఆరోగ్యం క్షీణించిందంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అదంతా ఏమీ లేదని అంటున్నారు సమంత ఫ్యామిలీ.. సమంత బాగానే ఉన్నారని చెప్పుకొచ్చారు.
ఇటీవల సమంత యశోద మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనగా, అందులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రీసెంట్‌గా జరిగిన ఓ కార్యక్రమంలో కూడా సమంత స్టన్నింగ్ కామెంట్స్ చేసింది. తనకు కోపం వస్తే జిమ్‌లో అధికంగా వర్కౌట్స్ చేస్తుందట. ఇష్టానుసారంగా ఎక్సర్ సైజ్‌లు చేస్తానని, వెంటనే కోపం తగ్గిపోతుందని చెప్పుకొచ్చింది సమంత. తాను డబ్బుకి, పేరు ప్రఖ్యాతల కోసం పెద్దగా ఆరాటపడడని చెప్పిన సమంత తనకు డబ్బు కన్నా నటనే ముఖ్యం అని చెప్పుకొచ్చింది. తనకు తానే పెద్ద విమర్శకురాలినని, మన మిస్టేక్స్ ని, పొరపాట్లని తెలుసుకోగలిగితేనే వృత్తిలో ఎదగగలమని అంటుంది.
కాలం కలిసి వస్తే జీవితంలో ఏదైన జరుగుతుంది. మనకు నచ్చినట్టుగా జీవించాలని, భూమ్మీదకు వచ్చింది ఎవరి అభినందనల కోసమో, ఇతర సంతోషపెట్టడానికో కాదని, మనకు ఉన్నదాంట్లో సంతోషంగా ఉండాలని, అప్పుడే మనకు కావాల్సింది వెతుక్కుంటూ వస్తుందని సమంత చెప్పుకురావడం గమనర్హం. అయితే సమంత ప్రస్తుతం ఖుషీచిత్రంతో బిజీగా ఉంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీ `శాకుంతలం` చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది.