Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైవిధ్యమైన సినిమాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. చివరిగా ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమాతో పలకరించిన రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రూపొందుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఎవరి దర్శకత్వంలొ చేయబోతున్నారు అని ప్రచారం జరుగుతున్ సమయంలో బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు అని ప్రకటన వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన బుచ్చిబాబు సన డైరెక్టర్ గా తన మొదటి సినిమా ఉప్పెనతోనే మంచి హిట్ ను అందుకున్నారు. సినిమాతో పాటు సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ కాగా, సినిమా మంచి విజయాన్ని సాధించింది.
బుచ్చిబాబు ఎన్టీఆర్‌తో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నట్టు వార్తలు రాగా, రామ్ చరణ్ సినిమాని తెరకెక్కించబోతున్నట్టు అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. కాగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సహకారంతో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా రామ్ చరణ్ ఎదిగిపోయిన రామ్ చరణ్.. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చేయనుండడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించనుందని, ఇప్పటికే ఆ మేరకు ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. 2018లో ‘దఢక్’ మూవీతో తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్.. ఆ తర్వాత వరుసగా లేడీ ఓరియెంటెడ్ మూవీలు ‘గుంజన్ సక్సేనా’ ‘గుడ్ లక్ జెర్రీ’లో నటించగా, ఇటీవల ‘మిలీ’ అనే లేడి ఓరియెంటెడ్ చిత్రంతో అలరించింది. గత కొంత కాలంగా జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందనే టాక్ వినిపిస్తుండగా, ఇప్పుడు రామ్ చరణ్ సినిమితో వెండితెర ఆరంగేట్రం చేయనుందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియల్సి ఉంది. ఒకవేళ జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే? ఇది కచ్చితంగా క్రేజీ కాంబినేషన్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ 1990-2000లో వచ్చిన సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలవగా, ఇప్పుడు రామ్ చరణ్- జాన్వీ కాంబోలో చిత్రం ఎంత పెద్ద విజయం సాధిస్తుందా అని ప్రతి ఒక్కరు ఆలోచనలు చేస్తున్నారు.