Ruturaj Gaikwad 7 Sixes Video : ఒకే ఓవర్లో 6 సిక్సులు బాదడం చూసి ఉంటారు.. కానీ 7 సిక్సులు బాదడాన్ని ఎప్పుడైనా చూశారా..? టీమిండియా యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్లో 7 సిక్సులు బాది సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్స్ ఫైనల్స్‌లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర ఓపెనర్‌గా బరిలోకి దిగిన గైక్వాడ్ ఈ ఘనత సాధించాడు. సోమవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శివ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్‌లో ఈ అద్భుతం చోటు చేసుకుంది.
మొదటి 5 బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. ఆ తర్వాత శివ నో బాల్ వేశాడు. దాంతో ఫ్రీ హిట్, ఆ తర్వాతి బంతిని కూడా రుతురాజ్ స్టాండ్స్‌లోకి పంపిచాడు. ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. రుతురాజ్ విధ్వంసంతో ఆ ఓవర్‌లో రికార్డు స్థాయిలో 43 పరుగులు వచ్చాయి. ఆ ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసి (220) నాటౌట్‌గా నిలిచాడు. రుతురాజ్ 7 సిక్సర్లతో చెలరేగిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పెట్టింది. రుతురాజ్ ఈ రేంజ్‌లో చెలరేగడంతో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం చాలా సంతోషంగా ఉంది.
సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో విఫలం కావడంతో టీమిండియాలో చోటు కోల్పోయాడు గైక్వాడ్. ప్రస్తుతం పునరాగమనం చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. అయితే గతంలో 2007 టీ 20 వరల్డ్‌కప్‌లో భారత ఆటగాడు యువరాజ్ ఇంగ్లండ్ మీద సింగ్ 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టాడు. 2007 వన్డే వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా ప్లేయర్ హెర్షలీ గిబ్స్ నెదర్లాండ్స్ మీద ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టాడు. వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పోలార్డ్, శ్రీలంక ఆల్‌రౌండర్ తిషారా పెరీరా కూడా ఈ ఫీట్ సాధించారు.
Outrageous from Ruturaj Gaikwad!#Cricket #VijayHazareTrophy #IndianCricket #TeamIndia #CSK #Gaikwadpic.twitter.com/2wI48GAJNS
— CRICKETNMORE (@cricketnmore) November 28, 2022