దొంగలు అంటేనే ఎవరీ కంటపడకుండా దొంగతనం చేస్తారు. విలువైన వస్తువులను, నగదును క్షణాల్లో దోచుకుంటారు. దొంగతనం జరిగినట్టు కూడా మనకు తెలియదు. అంత స్మార్ట్ గా దోచుకుంటారు దొంగలు. ఆ రకంగానే ఓ వృద్ధురాలు కూడా జ్యువెలరీ షాపులోకి ప్రవేశించి స్మార్ట్ గా గోల్డ్ నెక్లెస్ ను అపహరించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో కంటోన్మెంట్ పోలీసు స్టేషన్ పరిధిలోని బాల్దేవ్ ఫ్లాజాలోని ఓ జ్యువెలరీ షాపులోకి వృద్ధురాలి ప్రవేశించింది. నలుపు రంగు కళ్ల జోడు, ముఖానికి మాస్కు ధరించింది. ఇక బంగారం నెక్లెస్ చూపించమని షాపు సిబ్బందిని కోరింది. జ్యువెలరీని చూస్తూనే మెల్లిగా నెక్లెస్ బాక్స్ ను తన చీర కొంగు కిందకు పెట్టుకుంది. అయితే, నెక్లెస్‌ను దొంగిలించడానికి మహిళలు కేవలం 20 సెకన్ల సమయమే తీసుకున్నందున నెటిజన్లు షాక్ అవుతున్నారు.
అనంతరం ఏమీ తెలియని ఇంకో జ్యువెలరీ బాక్సును సిబ్బందికి ఇచ్చింది. తన వెంట తెచ్చుకున్న బ్యాగు తీసుకొని, కొంగు కిందే నెక్లెస్ బాక్సును పెట్టుకుని షాపు నుంచి బయటకు జారుకుంది. ఈ ఘటన నవంబర్ 17న జరగ్గా, ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ నెక్లెస్ విలువ రూ. 10 లక్షలు ఉంటుందని షాపు యజమాని పేర్కొన్నాడు. జ్యువెలరీ షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఓ వృద్ధురాలు అంత చాకచక్యంగా నగలు కొట్టేయడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
गोरखपुर में काले चश्मे वाली महिला ने जूलरी शॉप में ऐसे पार किया सोने का हार pic.twitter.com/rqpzQGkw1n
— Samir Abbas 🇮🇳 (@TheSamirAbbas) November 26, 2022