Itlu Maredumilli Prajaneekam : టాలీవుడ్ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న హీరో అల్లరి నరేష్. కెరీర్ ఆరంభం నుంచీ కామెడీ చిత్రాలతో వచ్చిన ఈ టాలెంటెడ్ హీరో.. ఈ మధ్య డిఫరెంట్ కాన్సెప్టులతో అలరించే ప్రయత్నం చేస్తున్నారు. చివరిగా ‘నాంది’తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఇక, ఇప్పుడు అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమాతో వచ్చేశాడు. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ
గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయిన శ్రీనివాస్ శ్రీపాద(అల్లరి నరేష్) నీతి, నిబద్ధత, బాధ్యతాయుతంగా ఉంటాడు. ఆయన ఎలక్షన్ డ్యూటీ మీద మారెడుమిల్లి తండాకు వెళతాడు. అక్కడ అడవిలో మగ్గిపోతున్న ప్రజల జీవితాలు చూసి చలించిపోతాడు. అక్కడ వారు ఓటు కి నిరాకరించడం మరియు వారికీ చెందిన వ్యక్తి అప్పన్న చనిపోడంతో, జరిగినా అన్యానికి కి న్యాయం కావాలి వారు అనడంతో కథలో ట్విస్ట్ మలుపు తిరుగుతుంది , మారేడుమిల్లి ప్రజానీకం కోసం శ్రీనివాస్ ప్రయత్నం ఎంతవరకు ఫలించింది? అనేదే మిగతా కథ.
పర్‌ఫార్మెన్స్:
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రంలో అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర, ప్రవీణ్, సంపత్ రాజ్, రఘుబాబు, శ్రీతేజ్ తదితరులు నటించారు. నరేష్ ఎప్పటి మాదిరిగానే తన నటనతో మెప్పించాడు. ఎమోషనల్, సీరియస్ సన్నివేశాల్లో నరేష్ నటన అద్భుతమని చెప్పాలి.ఇక హీరోయిన్ ఆనందితో పాటు కీలక రోల్స్ చేసిన నటులు తమ పాత్ర పరిధిలో మెప్పించారు. వెన్నెల కిషోర్ ఈ సీరియస్ చిత్రానికి మెయిన్ పిల్లర్‌గా నిలిచాడు, అతను తన నటనతో మిమ్మల్ని నవ్విస్తాడు మరియు చమ్మక్ చంద్ర, ప్రవీణ్, సంపత్ రాజ్, రఘు బాబు, శ్రీతేజ్ అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
చిత్రంలో సాంకేతిక అంశాలు పర్వాలేదు అన్నట్లు ఉన్నాయి. కమర్షియల్ అంశాలు లేకపోవడం, స్లోగా సాగే స్క్రీన్ ప్లే నిరాశపరిచే అంశాలు. అల్లరి నరేష్ మూవీ అంటే కనీస స్థాయి కామెడీ కోరుకుంటారు. అది కూడా ఈ మూవీలో కనిపించదు. అలాగే హిందీ హిట్ మూవీ న్యూటన్ ని పోలి ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ రాంరెడ్డి అందమైన లొకేషన్‌లను బాగా చిత్రీకరించారు కానీ కలర్ టోన్ ఇంకా బాగుండాల్సింది, శ్రీ చరణ్ పాకాల పాటలు అంతగా లేవు.
ప్లస్ పాయింట్స్:
- అల్లరి నరేష్ నటన
- కథ
- పతాక సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
- కమర్షియల్ ఎలిమెంట్స్
- స్క్రీన్ ప్లే
చివరిగా..
సామాజిక అంశాన్ని నిజాయితీగా చెప్పిన దర్శకుడిని మెచ్చుకోక తప్పదు. కామెడీ హీరోగా పేరున్న అల్లరి నరేష్ ఈ సినిమాలో మరో సారి తన యాక్టింగ్‌తో మెప్పిస్తాడు. ప్రీ-క్లైమాక్స్‌కి ముందు కథ నత్త నడక నడుస్తుంది మరియు క్లైమాక్స్‌లో కథ అల్లకల్లోలంగా ఉంటుంది, అయితే మొత్తం ప్యాకేజీగా చూసినప్పుడు ప్రతి సాధారణ ప్రేక్షకులకు ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. తప్పక ఈ చిత్రాన్ని చూడొచ్చు.