Kantara OTT : కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన సూపర్ నేచురల్ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్ మూవీ కాంతారా. కన్నడ సినిమాగా రూపొందిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు ఈ మూవీకి నీరాజనం పలికారు. ప్రపంచవ్యాప్తంగా 369 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్‌లను సాధించి భారీ బాక్స్ ఆఫీస్ హిట్‌గా నిలిచింది కాంతార సినిమా. కాంతారా డిజిటల్ ప్రీమియర్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా, ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.
ఎట్టకేలకు కాంతార ఓటీటీ రిలీజ్ విషయంపై క్లారిటీ వచ్చింది . ఈ నెల 24వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ కాబోతోందని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ హక్కులు దక్కించుకోగా, వాస్తవానికి ఈ నెల 4వ తేదీనే ఓటీటీలో విడుదల చేయాలని భావించారు. కానీ, థియేటర్లలో విశేష స్పందన రావడంతో ఓటీటీ స్ట్రీమ్ ను వాయిదా వేశారు. ఎట్టకేలకు వచ్చే వారం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేయాలని నిర్ణయించారు. కాంతారా కలెక్షన్లు ప్రస్తుతం రూ.369 కోట్లుగా ఉన్నాయి.. మరో వారం రోజుల్లో ఈ మూవీ రూ.400 కోట్ల క్లబ్ లో చేరుతుందని వారు బావిస్తున్నారు.
దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ వారం రోజులు ఆలస్యంగా.. అంటే (నవంబర్ 24) వచ్చే గురువారానికి వాయిదా పడినట్లు తెలుస్తుంది. చిన్న సినిమాగా వచ్చి.. దక్షిణాదిని ఒక ఊపు ఊపేసి.. భారీ వసూళ్లు రాబట్టిన సినిమా కాంతార సినిమా విడుదలై 50 రోజులు కావస్తున్నా.. ఇప్పటికీ ఈ సినిమాకు థియేటర్లలో ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. మాతృభాష కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం ఎంతగానో అలరిస్తుంది. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా.. పెద్దగా ప్రమోషన్స్ చేయకుండా కేవలం మౌత్ టాక్ తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రూ.16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం గొప్ప విషయం అనే చెప్పాలి.