Krishna : సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15 తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి ఎంతో మందిని కలిచివేసింది.నటుడిగా, నిర్మాతగా, దర్శకుడుగా, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలకు గాను ఆయన అంత్యక్రియలని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. 350 పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని ఇరు రాష్ట్రాల సీఎం లుఅన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘీక చిత్రాల నటుడుగా కృష్ణ జనాదరణ పొందారు.
గుండెపోటుకు గురై కృష్ణ హాస్పిటల్‌లో చేరి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చేరిన తర్వాత కూడా కృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు వార్తలు రాగా, ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్రమక్రమంగా విషమించింది. కృష్ణ అన్ని అవయవాలు దెబ్బతిన్నాయని , ఏకంగా 9 మంది డాక్టర్ల బృందం కృష్ణను బతికించడానికి శ్రమించినా ఫలితం లేకుండా పోయిందని వైద్యులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు కృష్ణకు సంబంధించిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. అందులో ఆయన హాస్పిటల్ బెడ్‌పై ఉండగా, ఇందులో మాస్క్ పెట్టుకొని ఉన్నారు. ఇందులో సెలైన్లు ఎక్కిస్తుండటం చూడొచ్చు. అయితే ఇదే చివరి ఫొటో అన్న ప్రచారం జరుగుతుండగా, ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియదు.
సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక శకం ముగిసిపోయింది. ఆయన తోటి హీరోలు, సీనియర్ హీరోలు కూడా ఒకరి తర్వాత ఒకరు స్వర్గస్తులు కాగా, చివరిగా కృష్ణ మరణంతో వీరి శకం పూర్తయింది అని చెప్పాలి. ఇకపోతే కృష్ణ మరణం తర్వాత ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో మహేష్ బాబు తండ్రి మరణంతో ఒంటరివాడయ్యాడు అంటూ తెగ వార్తలు , పోస్టులు చేస్తూ ఉన్నారు. మహేష్ బాబుకి తల్లి ఇందిరాదేవి చనిపోయిన నెలకి తండ్రి చనిపోవడం నిజంగా బాధాకరం.