Dil Raju : అప్పటి హీరోలు బాలకృష్ణ, చిరంజీవి కుర్ర హీరోలతో పోటీ పడి మరి సినిమాలు చేస్తున్నారు. బాలకృష్ణ చివరిగా అఖండ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకోగా, చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీతో మంచి సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతి బరిలో పోటీ పడేందుకు సిద్దమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే సినిమాతో సంక్రాంతి బరిలో దిగుతున్నారు. డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.ఇక ఇదే సమయానికి గోపీచంద్ మలినేని లేని డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న వీరసింహారెడ్డి సినిమా కూడా విడుదలవుతుంది.
బాలయ్య సినిమాలో కూడా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ రెండు సినిమాలు సంక్రాంతికి దిగడం దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఈ ఇద్దరు కలిసి ఇలా సంక్రాంతి బరిలో పోటీ పడటం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో సంక్రాంతికి పోటీ పడ్డారు. అయితే సంక్రాంతి బరిలోకి ‘వారసుడు’ కూడా వచ్చాడు. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోంది ఈ చిత్రం. దిల్ రాజు నిర్మాత.
వారిసు’ పేరుతో తమిళంలో రూపొందుతోన్న ఈ సినిమాను ‘వారసుడు’గా తెలుగులోకి అనువాదం చేస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్గా రూపొందుతోన్న ఈ చిత్రానికి తమన్ సంగీత అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆంధ్ర, నైజాంలో దిల్ రాజు ఎక్కువ థియేటర్లు లాగేసుకుంటున్నారు అనే టాక్ వినిపిస్తుంది. ఒక తమిళ హీరో కోసం తెలుగులో స్టార్ హీరోలు అయిన చిరు, బాలయ్య సినిమాలకు గండిగొడతావా అంటూ చిరంజీవి, బాలయ్య అభిమానులు దిల్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ‘వారసుడు’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో చేసిన మార్కెట్ రూ.9 కోట్లని.. దాని కోసం రూ.60 నుంచి రూ.70 కోట్లు బిజినెస్ చేసే సినిమాలకు అడ్డుపడతావా అంటూ కొందరు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.