Master Khaidi Vikram Movies : తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పుడు అందరి చూపు విక్రమ్ చిత్ర డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పైనే ఉంది. కేవలం నాలుగు అంటే నాలుగు సినిమాలుతోనే తన దర్శకత్వ ప్రతిభను చూపించిన ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. లోకేష్ కనగరాజ్ తో సినిమాలు చేయడానికి తమిళ హీరోలతో పాటు మన తెలుగు హీరోలు కూడా క్యూ కట్టేస్తున్నారు.
ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ తో లోకేష్ కనగరాజ్ సౌత్ ఇండస్ట్రీలోనే సంచలనం డైరెక్టర్ గా మారిపోయాడు. లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కిన నగరం మూవీని మొదటగా తెలుగులో డబ్ చేశారు. ఈ సినిమాలో సందీప్ కిషన్, రెజీనా హీరోహీరోయిన్ లుగా నటించారు. 2017లో విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక లోకేష్ కనగరాజ్ రెండో సినిమా ఖైదీ. ఈ సినిమాలో కార్తీక్ హీరోగా నటించారు.
ఖైదీ సినిమా విజయంతో లోకేష్ కనకరాజ్ తమిళ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేసే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ఆ సినిమానే రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్టర్. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ భారీ అంచాల నడుమ విడుదలై మాస్టర్ భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన అతి తక్కువ కాలంలోనే లోకేష్ కనకరాజు మళ్లీ కమల్ హాసన్ హీరోగా విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సైలెంట్ గా ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో ఘనవిజయాన్ని అందుకుంది.
విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ తో పాటూ తమిళ స్టార్ లు సూర్య, విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కూడా నటించారు. ఈ చిత్రంతో లోకేష్ కనకరాజు మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా తన దర్శకత్వ ప్రతిభకు చూపించాడు. దాంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ యంగ్ డైరెక్టర్ గురించే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే లోకేష్ కనగరాజ్ సినిమాలలో కామన్ గా ఒక పాయింట్ కనిపిస్తుంది. ఆ కామన్ పాయింట్ ఏంటంటే..? లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన విజయ్ మాస్టర్ సినిమా మినహా మిగత మూడు సినిమాలు నైట్ మోడ్ లోనే ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.