Cough : వాతావరణం చల్లగా ఉంటే అందరికీ నచ్చుతుంది. కానీ, ఈ వాతావరణం కొంతమందికి ఆరోగ్య సమస్యలు తీసుకొస్తుంది. జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటితో సతమతమవుతుంటారు. వీటిలో దగ్గు మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. గొంతు వెనకాల మ్యూకస్, ఏవో తెలియని చికాకు పెట్టే జీవులు జారుకున్నప్పుడు దగ్గు అసంకల్ప ప్రతీకార చర్యగా వస్తుంది. ఈ సమస్య మొదలైనప్పటి నుంచి సమస్యను తగ్గించే మార్గాలను వెతుకుతాం.. అయితే, కొన్ని ఇంటి చిట్కాల ద్వారా సమస్యను తగ్గించుకోవచ్చు.
అల్లం, టీ పౌడర్, తులసి: గ్లాసు నీటిలో అర టీ స్పూన్ అల్లం తరుముకు, కొద్దిగా టీ పౌడర్, మూడు తులసి ఆకులు వేసి సుమారు 10 నిమిషాలు మరిగించాలి. ఈ ద్రవం చల్లారిన తరువాత తాగితే గొంతులో గరగరతో పాటు దగ్గు తగ్గుతుంది. పొడి దగ్గు.. ఛాతిలో పట్టినట్టు ఉంటే: దీని కోసం ముందు 3 కప్పుల నీళ్లలో 2 తమలపాకులు, నాలుగు మిరియాలు ( పొడి ) వేసి కలిపి 15 నిమిషాలు మగరబెట్టి దించాలి. ఈ మిశ్రమంలో చెంచాడు తేనె కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవాలి.
దీర్ఘకాలంగా దగ్గు ఉంటే: దీర్ఘకాలికంగా దగ్గు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. అలాగే గ్లాసు నీటిలో 3 మల్బరీ ఆకులను వేసి 10 నిమిషాలు మరగబెట్టాలి. ఇందులో ఎగ్ వైట్ (తెల్ల సొన) మిక్స్ చేసి తాగాలి. గొంతు గరగర తగ్గాలంటే: లవంగాలు చప్పరిస్తే గొంతులో గరగర తగ్గుతుంది. దాంతో పాటు పాలలో పసుపు వేసుకుని తాగితే ఉపయోగం ఉంటుంది. గుర్రపు ముల్లంగి సిరప్: పావు కప్పు తేనెలో తురిమిన గుర్రపుముల్లంగిని వేయండి. దీన్ని కొన్ని గంటల పాటు అలాగే ఉంచి దగ్గు సిరప్‌గా వాడండి. పై వంటింటి చిట్కాలు ద్వారా దగ్గు నుంచి ఉపశమనం పొందండి.