యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా దూసుకుపోతున్నాడు. ఆయనకు ఇప్పుడు కేవలం సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోను ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బాహుబలితో భారీ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో అంతగా అలరించలేకపోయాడు. ఇక ప్రభాస్ అభిమానులు ఆదిపురుష్ పై పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ చూసి దానిపై ఆశలు వదిలేసుకున్నారు. ఈ సినిమా టీజర్ పై అనేక మీమ్స్, ట్రోల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ప్రభాస్‌కి షార్ట్ టైంలో ఇంత క్రేజ్ రావడం పట్ల కొందరు ఆయనపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.
ఇప్పటికే బాలీవుడ్ మీడియా కొన్ని సార్లు ప్రభాస్ గురించి తప్పుడు కథనాలు ప్రచురించని విషయం తెలిసిందే. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇండోనేషియా ప్రభాస్‌పై సెటైరికల్‌గా ఓ పోస్ట్ పెట్టింది. సాహో నుండి క్లిప్ పోస్ట్ చేసి దానికి క్యాప్షన్‌గా ఇది ఎలాంటి యాక్షన్ అని రాసారు. ఇది ప్రభాస్‌ని కించపరిచలే ఉండడంతో ప్రభాస్ అభిమానులు నెట్ ఫ్లిక్స్ మీద విరుచుకుపడుతూ నెట్‌ఫ్లిక్స్ అన్‌సబ్‌స్క్రైబ్ అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. మరి దీనిపై ప్రభాస్ కాని ,సాహో చిత్ర బందం కాని ఏమైన స్పందిస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భారీ అంచనాలతో వచ్చిన సాహో చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎంతగా నిరాశపరచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులోని కొన్ని సీన్స్ ప్రేక్షకులకి చాలా విసుగు తెప్పించాయి. ఈ సన్నివేశం కూడా అలాంటిదే. ప్రభాస్ లాంటి మంచి నటుడితో ఇలాంటి సీన్స్ చేయించండంతో ఆ సమయంలో చాలా విమర్శలు కూడా చేశారు. అయితే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఇండోనేషియా సాహో క్లిప్ షేర్ చేయడం, దానికి పెట్టిన కామెంట్ కాస్త వెటకారంగా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
https://twitter.com/NetflixID/status/1587806745279307776