తన సంగీతంతో కుర్రకారుకి హుషారెక్కించే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ . మెగా ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఆయన సినిమాలకు దాదాపు దేవీనే మ్యూజిక్ అందించాలని కొందరు డైరెక్టర్లు కోరుతుంటారు. మెగా సినిమాలకే కాకుండా దేవి ఇతర సినిమాలకు కూడా మంచి సంగీతాన్ని అందించి కుర్రాళ్లలో జోష్ పెంచుతుంటాడు దేవి శ్రీ. ఇటీవల తన జోరు తగ్గనా కూడా అడపాదడపా మెరుస్తూనే ఉన్నాడు. అయితే ఇటీవల కొంత ఖాళీ సమయం దొరకడంతో ఆల్బమ్స్ కూడా చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయన ఇటీవల ‘ ఓ పారి’ అనే అల్బమ్ ను తయారు చేశారు.
ఐటెం సాంగ్‌ని పోలి ఉన్న ఈ ఆల్బమ్‌లో ‘హరే రామ హరే కృష్ణ’ పదాల్ని వినియోగించడంపై సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోని హిందూ సంఘాలతో కలిసి ఆమె సైబర్ క్రైమ్స్‌లో దేవిశ్రీ ప్రసాద్‌పై ఫిర్యాదు చేసింది. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిన దేవిశ్రీపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ‘హరే రామ హరే కృష్ణ’ హిందువులకి చాలా పవిత్రమైన మంత్రమని , దాన్ని ఐటెం సాంగ్‌ని పోలి ఉన్న ‘ఓ పరి’లో వాడటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆ ఆల్బమ్‌లో పదాలు వాడిన దేవిశ్రీ ప్రసాద్ వెంటనే హిందువులకి క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేసింది. అంతే కాక అందులోని ‘హరే రామ హరే కృష్ణ’ పదాల్ని తొలగించాలని కూడా ఆమె డిమాండ్ చేసింది. ‘ఓ పారి’ అల్బమ్ లో విదేశీ మోడల్స్ నృత్యం ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్ లాంటి దేశాల్లో దీనిని చిత్రీకరించారు. ఈ సాంగ్ పూర్తి బాధ్యతలు తనదేనని దేవి శ్రీ ఇదివరకే ప్రకటించారు. మరి కరాటే కళ్యాణి ఆరోపణలపై దేవి శ్రీ ప్రసాద్ ఏమన్నా స్పందిస్తాడా అనేది చూడాలి.