Manchu Vishnu : మా అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా’ అసోసియేషన్‌లో సభ్యత్వం ఉన్నవారే.. సినిమాల్లో నటించాలని నిర్మాతలకు సూచించామని చెప్పారు. అసోసియేషన్‌కు వ్యతిరేకంగా ఎవరైనా ధర్నాలు చేసినా..మీడియాకు వెళ్లినా సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తామన్నారు. ఎన్నికల్లో తాను చేసిన వాగ్ధానాలు 90 శాతం పూర్తి చేశానన్నారు. గత ఏడాది అక్టోబర్ 13న విష్ణు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తన తండ్రితో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. నేను మా అసోసియేషన్ కి మాత్రమే కాదు తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ జవాబుదారీని అని విష్ణు పేర్కొన్నారు.
మా ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలని తలపించాయి. ప్రస్తుతం మా అసోసియేషన్ లో 20 శాతం మంది నటులు కానివారు సభ్యులుగా ఉన్నారు. దీనిని మార్చాలని చూస్తున్నాం. మాలో శాశ్వత సభ్యత్వం ఉండాలంటే కనీసం రెండు చిత్రాల్లో అయినా నటించి ఉండాలి. కనీసం ఐదు నిమిషాల పాత్రలో నటించి డైలాగ్స్ చెప్పి ఉండాలి. మాలో అసోసియేట్ సభ్యులు కూడా ఉంటారు. కానీ వారికీ ఓటు వేసే హక్కు ఉండదు. ఐదేళ్ల పాటు మాలో శాశ్వత సభ్యత్వం ఉన్నవారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది అని తెలిపారు. ఇక ఎన్నికల సమయంలో తమకు వ్యతిరేఖంగా పని చేసే వారికి కాస్త చురకలు కూడా అంటించారు.
మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘మా’ సభ్యులందరికీ షిరిడీ సాయి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ‘మా’ ఎన్నికల్లో విష్ణు ఓడిపోవాలని కోరుకున్నవారు కూడా బాగుండాలి అని వ్యాఖ్యానించారు. విష్ణు చేసే పనుల్లో మోసం, దగా లేవని అన్నారు. తాము ఇచ్చిన వాగ్దానాల్లో 90 శాతం నెరవేర్చామని, ఫిలిం చాంబర్ భవనాన్ని కూల్చి, కొత్త భవనం నిర్మించేందుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని మంచు విష్ణు వెల్లడించారు. ఇందులో మంచు విష్ణు చేసిన కొన్ని వ్యాఖ్యలు మెగా కాంపౌండ్‌ని ఉద్దేశించి చేసినట్టుగా తెలుస్తుంది.