Directors : ఒక సినిమా హిట్ కావాలన్నా, ఫ్లాప్ కావాలన్నా కూడా మొత్తం దర్శకుడి చేతిలోనే ఉంటుంది. అతడు కెప్టెన్ ఆఫ్ ది షిప్. 24 క్రాఫ్ట్‌లని సరైన పద్దతిలో వాడుకుంటూ సక్సెస్ సాధించాల్సి ఉంటుంది. ఒకసారి సినిమాపై ఎంతో నమ్మకం ఉన్నా కూడా కొన్ని సార్లు ప్రేక్షకులు ఆ సినిమాలని ఫ్లాప్ చేస్తారు. అయితే పెద్ద పెద్ద దర్శకులు సైతం తమ కెరియర్ లో ఫ్లాప్స్ చవి చూశారు. కానీ ఓ ఏడుగురు దర్శకులు మాత్రం ఫ్లాప్ రుచి చవి చూడలేదు. వారెవరో ఇప్పుడు ఓ సారి చూద్దాం.
ఓటమెరుగని విక్రమార్కులలో రాజమౌళి ముందు ఉంటారు. ఆయన స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో కెరీర్‌ని మొదలు పెట్టి వరుస హిట్స్ అందుకున్నాడు. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ తో విదేశాల్లో సైతం జక్కన్న సత్తా చాటాడు. ఆయన కెరీర్ లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ గానే నిలిచాయి. ఇక కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా అపజయం అనేది లేకుండా విజయాలు సాధించాడు. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరవాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు. ఇక తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీకి కూడా ఫ్లాప్ అనేది ఎరుగడు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ కత్తి సినిమాతో సత్తా చాటాడు. రీసెంట్ గా కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆయన చేసిన సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.
ఇక బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాని ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించాడు. ఆయనకు ఫ్లాప్ అనేది తెలియదు. పీకే, త్రీ ఇడియల్స్ లాంటి చిత్రాలతో రాజ్ కుమార్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి వరుస సూపర్ హిట్ లతో దూసుకుపోతున్నాడు. ప్రాజెక్ట్ కె దర్శకుడు నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రమణ్యం సినిమాతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మహానటి లాంటి ఎపిక్ తీసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇతనికి కూడా ఒక్క ఫ్లాప్ లేదు.