Anushka Shetty : టాలీవుడ్ జేజమ్మ అనుష్క పెళ్లి విషయం గత కొన్ని సంవత్సరాలుగా హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఒకసారి ప్రభాస్‌తో పెళ్లి అని ఇంకోసారి వ్యాపారవేత్తతో అని మరోసారి రాజకీయ నేత కొడుకు అని ఇలా అనుష్క పెళ్లికి సంబంధించి ప్రచారాలు సాగుతూనే ఉన్నాయి. ఎన్ని ప్రచారాలు జరుగుతున్నా కూడా అనుష్క వాటిపై పెద్దగా స్పందించడానికి ఇష్టపడదు. తాజాగా ఈ అమ్మడి పెళ్లి విషయం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణకి చెందిన వ్యక్తినే అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని తాజాగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి అనుష్క వయస్సు 40 కి దగ్గర పడింది. ఆమెకు ప్రస్తుతానికి చేతిలో సినిమాలు కూడా సరిగ్గా లేవు.
త్వరలోనే ఆమె వివాహానికి సిద్ధమవుతున్నట్లు సరికొత్త ప్రచారం జరుగుతోంది. తెలంగాణకు చెందిన ఓ బడా వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లి జరగనుందని, ఇప్పటికే అనుష్క నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా రావడంతో పెళ్లి పనులు మొదలు పెట్టడానికి కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అనుష్క పెళ్లి చేసుకోబోయే వరుడికి బంగారం బిజినెస్ ఉందని అంటున్నారు. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందనేది చూడాలి. ఇక అనుష్క ఇటీవల సినిమాలు చాలా తగ్గించింది. నవీన్ పోలిశెట్టి హీరోగా ఒక సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు దానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయితే బయటకు రాలేదు.
![Anushka Shetty : అనుష్క శెట్టి పెళ్లి ఫిక్స్..? వరుడు అతనే..? Anushka Shetty marriage reportedly with gold business man](http://3.0.182.119/wp-content/uploads/2022/09/anushka-shetty.jpg)
సైజ్ జీరో సమయంలో బరువు పెరిగిన అనుష్క.. తర్వాత బరువు తగ్గలేకపోయింది. బొద్దుగానే ఉంటూ బాహుబలి, భాగమతి, నిశ్శబ్దం చిత్రాలను పూర్తి చేసింది. నిశ్శబ్ధం చిత్రం తర్వాత అనుష్క బయట కూడా పెద్దగా కనిపించడం లేదు. కృష్ణం రాజు మృతి సమయంలోనే ఆమె కనిపించారు. అప్పుడు కూడా అనుష్క కాస్త బొద్దుగానే ఉన్నట్టు తెలుస్తుంది. సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా పేరొందిన అనుష్క ఎందుకు ఇలా సినిమాలకి దూరంగా ఉంటుందో ఎవరికీ అర్ధం కావడం లేదు.