KTR Son Himanshu : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కుమారుడు హిమాన్షు రావుపై ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా హిమాన్షు బాగా బరువు ఉండడంతో అతనిపై ఎంతో మంది ఇన్‌డైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా కామెంట్స్ చేశారు. అతన్ని చాలా మంది విమర్శిస్తూ ట్రోల్స్ కూడా చేశారు. అయితే హిమాన్షు మాత్రం వాటిని లైట్ తీసుకున్నాడు. సాధారణంగా హిమాన్షు బయట ఎక్కువగా కనిపించడు. కానీ లేటెస్ట్‌గా బయటకు వచ్చిన అతని ఫొటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి.
హిమాన్షుకు చెందిన లేటెస్ట్ ఫొటోలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ఆ ఫొటోలను చూసిన చాలా మంది గతంలో తాము చూసిన ఆ హిమాన్షుయేనా ఇలా మారిపోయాడు. ఇంతగా ఎలా చేంజ్ అయ్యాడు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా హిమాన్షు ఓ మ్యూజికల్ ప్రోగ్రామ్‌లో ఇలా స్లిమ్‌గా కనిపించి అలరించాడు. దీంతో అతని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
అయితే హిమాన్షు గతంలో అనేక మార్లు బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్నాడు. అతనిపై చాలా మంది కామెంట్లు చేశారు. దీంతో మంత్రి కేటీఆర్ కూడా తన కుమారుడి బరువు వల్ల ఆవేదన చెందారు. ఆయన విమర్శకులకు సమాధానం చెప్పలేకపోయారు. కానీ ఇప్పుడు హిమాన్షు పూర్తిగా మారిపోయాడు. కనుక కేటీఆర్ కాస్త గర్వంగా ఫీలవుతారని చెప్పవచ్చు.