Karthikeya 2 : చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రం.. కార్తికేయ 2. ఈ మూవీ ఆగస్టు 13న రిలీజ్ అయి ఘన విజయాన్ని సాధించింది. ఏకంగా రూ.100 కోట్లను వసూలు చేసి రికార్డులను సృష్టించింది. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి హిందీ ప్రేక్షకులు సైతం బ్రహ్మరథం పట్టారు. అయితే ఎట్టకేలకు ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
కార్తికేయ 2 చిత్రం అక్టోబర్ 5వ తేదీన జీ5 యాప్‌లో రిలీజ్ కానుంది. అంటే దాదాపుగా 6 వారాల అనంతరం ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందన్నమాట. ఇక ఈ మూవీలో శ్రీకృష్ణ తత్వం గురించి చాలా గొప్పగా చెప్పారు. అలాగే అనుపమ్ ఖేర్ ఓ ముఖ్య పాత్రలో నటించారు. అందువల్లే మూవీ హిట్ అయిందని చెప్పవచ్చు. ఆరంభంలో థియేటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ క్రమంగా పెంచారు. దీంతో హిందీ మార్కెట్‌లో హిట్ అయిన మరో తెలుగు చిత్రంగా కార్తికేయ 2 రికార్డులకెక్కింది.
కార్తికేయ మొదటి సినిమా హిట్ కావడంతో అదే ఊపుతో రెండో పార్ట్‌ను నిర్మించారు. అయితే మొదటి పార్ట్‌కు, రెండో పార్ట్‌కు కనెక్షన్ ఏమీ ఉండదు. రెండూ వేర్వేరు కథలు. ఇక కార్తికేయ 2 హిట్ అవడంతో కార్తికేయ 3 ని కూడా తెరకెక్కిస్తామని ఇప్పటికే హీరో నిఖిల్ చెప్పారు. దీంతో ఆ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు.