Nanditha Raj : సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా నటించిన ప్రేమ కథా చిత్రం అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇందులో నందితా రాజ్ హీరోయిన్ గా నటించి తన కళ్ళతో అందరినీ భయపెట్టింది. అలాగే తన నటనతో అందరినీ మంత్రముగ్దుల్ని కూడా చేసింది. ఆ సినిమాతో బాగా గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె ఈ మధ్య సోషల్ మీడియాలోనూ కనిపించడం లేదు. దీంతో నందితా రాజ్ గురించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.
అసలు ఆమె ఎక్కడ ఉంది, ఏం చేస్తోందని పలువురు సెర్చ్ చేస్తున్నారు. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ భామ సరైన ఛాన్స్ లు రాక సినిమా రంగంలో నిలదొక్కుకోలేదు. నిజానికి డేరింగ్ డైరెక్టర్ తేజ డైరెక్ట్ చేసిన నీకు నాకు డాష్ డాష్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నందితాకు ఆ మూవీ ఫ్లాప్ అయినా మంచి మార్కులే పడ్డాయి. తరువాత ప్రేమ కథా చిత్రంతో అందరి దృష్టిలో పడింది.
అయితే ఆ మూవీ తర్వాత పలు సినిమాలు చేసినా సక్సెస్ రాలేదు. ఆ మధ్య కొత్త దర్శకుడు రాజా కిరణ్, నటుడు సత్యం రాజేష్ కాంబినేషన్ లో వచ్చిన విశ్వామిత్ర మూవీలో చేసినా అది హిట్ కాలేదు. సినిమాల సెలక్షన్ లో చేసిన పొరపాట్ల వలన సినిమాలు హిట్ అవ్వకపోవడంతో కెరీర్ ఇబ్బందుల్లో పడింది. దాంతో సినిమాలో ఛాన్స్ లు తగ్గిపోవడంతో మళ్ళీ మోడలింగ్ వైపు అడుగులు వేసింది. అయితే ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది.. ఏం చేస్తుంది.. అన్న వివరాలు మాత్రం తెలియవు. కానీ ముంబైలో ఉంటున్నట్లు సమాచారం. కానీ ఆమె కోసం నెటిజన్లు మాత్రం తెగ వెతికేస్తున్నారు.