Rashmi Gautam : కొందరికి కొన్నిసార్లు అవకాశాలు విరివిగా వస్తుంటాయి. వద్దన్నా కూడా అదృష్టం వారి తలుపు తడుతూనే ఉంటుంది. అలాంటి వారిలో రష్మీ గౌతమ్ తప్పక ఉంటుంది. జబర్ధస్త్ ద్వారా లైమ్ లైట్‌లోకి వచ్చిన రష్మీ గౌతమ్ మెల్లమెల్లగా తన క్రేజ్ పెంచుకుంటూ స్టార్ యాంకర్‌గా మారింది. యాంకర్‌గా సందడి చేస్తూనే వెండితెరపై కూడా అదృష్టం పరీక్షించుకుంటుంది రష్మీ. విభిన్నంగా యాంకరింగ్ చేస్తూ టెలివిజన్ ఆడియెన్స్ కి దగ్గరై రష్మీ యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. పదేండ్లుగా యాంకర్ రష్మీ తెలుగు ఆడియన్స్‌ని అలరిస్తూనే ఉంది.
ప్రస్తుతం రష్మీ గౌతమ్ రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. మొన్నటి వరకు జబర్ధస్త్ కార్యక్రమంతో పాటు చిన్నా చితకా షోలని హోస్ట్ చేసిన రష్మీ.. అనసూయ, సుధీర్ మల్లెమాల నుండి తప్పుకోవడంతో ఆ రెండు ఆఫర్స్ ని తానే దక్కించుకుంది. రీసెంట్ గా జబర్దస్త్ నుంచి అనసూయ వెళ్లిపోవడం రష్మీకి కలిసి వచ్చింది.. ఆ షో బాధ్యతను కూడా రష్మీ మీదనే పెట్టారు మేకర్స్. దాంతో రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో పెరిగినట్టు తెలుస్తోంది.
రష్మీ ఒక్క షోకు.. గతంలో రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకూ తీసుకునేదని సమాచారం. ఇప్పుడు రెండు షోలు చేస్తుంది కాబట్టి ఎపిసోడ్ కు రూ.3 లక్షల పైనే తీసుకుంటుందట రష్మీ. ఇక ఇదే కాకుండా శ్రీదేవీ డ్రామా కంపెనీ.. పలు స్పెషల్ ఈవెంట్స్ కూడా రష్మీనే హోస్ట్ చేస్తుంది. ఇలా టీవీ షోస్, సినిమాలు, సోషల్ మీడియా ద్వారా రష్మీ బాగానే సంపాదిస్తుందని అంటున్నారు. దాదాపు చిన్న పాటి హీరోయిన్ సంపాదన ఇప్పుడు రష్మీది అని కొందరు చెప్పుకొస్తున్నారు. కాగా రష్మీ గుంటూరు టాకీస్ అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన విషయం తెలిసిందే.