Free Bus Scheme : తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. తన హామీని నిలుపుకుంటూ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం మనం చూశాం. అయితే ఉచిత బస్సులని కొందరు దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఇటీవల ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హన్మకొండ నుంచి సిద్ధిపేటకు వెళుతున్న బస్సులో కొందరు మహిళలు వెల్లుల్లిపాయల పొట్టు తీసుకుంటూ, హాయిగా ఉచిత ప్రయాణం చేస్తుండడం ఆ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.
నిన్నమొన్నటి దాకా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు సీట్ల కోసం సిగపట్లు పట్టుకున్న ఘటనలు చూశాం. కొందరు ఇంట్లో బోర్ కొడుతుంటే టైం పాస్‌కు బస్ ఎక్కామని అంటే, ఇంకొకావిడ పిల్లలకు అన్నం తినిపించడానికి బస్సు ఎక్కామని చేసిన రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం చూశాం. గమ్యం చేరడానికి దాదాపు రెండున్నర గంటలు సమయం పడుతుందని సావధానంగా ఇంటి పనులు బస్సుల్లోనే చక్కబెట్టేస్తున్నారు మహిళలు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆర్టీసీ బస్సుకు ఏం ఖర్మ పట్టెర నాయనా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. కొందరైతే తీసిన పొట్టు ఎవరి నెత్తిన తలంబ్రాలు పొయ్యకుండా జర భద్రంగా మూట కట్టుకొని పోవాలని సలహా ఇస్తున్నారు.
ఉచిత బస్సు ప్రయాణం పథకంలో భాగంగా బస్సులో ప్రయాణించే మహిళలు బ్రష్ చేసుకుంటున్న వీడియో వైరల్ కావడం చూశాం. ఇంకొందరు మహిళలు పిచ్చాపాటిగా ముచ్చట్లు పెట్టుకోవడం కోసం కూడా బస్ ఎక్కుతున్నారు. ఇలా ఎవరికి వారు ఉచిత బస్‌ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మహిళలు తమ ఆధార్ కార్డును చూపిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు. మహిళలకు కూడా టికెట్ ఇస్తారని, అయితే.. సున్నా ఛార్జి టికెట్లు జారీ చేస్తున్నారు,