Team India : శ్రీలంకతో జరిగిన 2వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా చెత్త ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ 50కి పైగా యావరేజ్‌ను కలిగి ఉండి కూడా స్పిన్‌ను ఆడలేకపోయారని, కేవలం 240 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేకపోయారని, రేపు చాంపియన్స్ ట్రోఫీలో ఏం ఆడుతారని.. ఫ్యాన్స్ గట్టిగానే విమర్శిస్తున్నారు. అయితే ఆగస్టు 7వ తేదీన లంకతో మూడవ వన్డే జరగనుంది. ఇప్పటికే 1-0 తేడాతో శ్రీలంక సిరీస్‌లో ఆధిక్యంలో ఉంది. చివరి వన్డేలో కూడా ఓడిపోతే ఇండియా అత్యంత ఘోరమైన రికార్డును మూటగట్టుకుంటుంది. కనుక 3వ వన్డేలో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
3వ వన్డేలో గెలిచినా సిరీస్ డ్రా అవుతుంది. సిరీస్ ఓటమి కన్నా అదే నయం కదా. కనుక 3వ వన్డేలో ఎలాగైనా గెలవాలని టీమిండియా భావిస్తోంది. అయితే మొదటి రెండు వన్డేల్లో పేలవమైన ప్రదర్శన చేసిన ముగ్గురు ఆటగాళ్లను మాత్రం మూడవ వన్డేలో పక్కన పెట్టే చాన్స్‌లు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్పిన్‌ను బాగా ఆడుతాడని చెప్పిన శివం దూబే ఫెయిల్ అయ్యాడు. దీంతో దూబే స్థానంలో రియాన్ పరాగ్‌కు చాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. రియాన్ పరాగ్ టీ20 సిరీస్‌లో అద్భుతంగా స్పిన్ కూడా వేశాడు. కనుక దూబే స్థానంలో పరాగ్‌ను దించే చాన్స్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇక మరో ఆటగాడు కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్‌ను తీసుకునే చాన్స్ ఉందని అంటున్నారు. అలాగే బౌలర్ అర్షదీప్ సింగ్ స్థానంలో యువ ఆటగాడు హర్షిత్ రాణాకు చాన్స్ దక్కే అవకాశం ఉందని సమాచారం. ఇలా మొత్తం మూడు మార్పులను చేయాలని టీమిండియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 3వ వన్డేలో గెలిచి పరువు నిలబెట్టుకుంటారా.. లేక మళ్లీ ఓడి చేతులెత్తేస్తారా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.