Chandra Babu : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ సారి రెండు రాష్ట్రాలలో కూడా మార్పు కోరుకున్నారు ప్రజలు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేజిక్కించుకుంది.అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోల్చితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలడంతో మండలిలో గుత్తాపై అవిశ్వాస తీర్మానం వైపు బీఆర్ఎస్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అధికార కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉంటున్న శాసన మండలి చైర్మన్ గుత్తాకు వ్యతిరేకంగా అవిశ్వాసం నెగ్గితే రాజకీయంగా పైచేయి చాటుకోవచ్చని బీఆర్ఎస్ అధిష్టానం ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో శాసన మండలిలో తమ బలాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు సన్నద్ధమవుతోందన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవిశ్వాస తీర్మానాలతో అన్నింటిని కైవసం చేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికలు విజయ దుందిభీ మోగించిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆశించిన పెర్ఫామెన్స్ ప్రదర్శించ లేకపోయింది. మరోవైపు బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాకుండా కాంగ్రెస్ ఖంగు తినిపించింది.బీఆర్ఎస్ నేతలు అంతా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ వైపు వెళుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు తిరిగి తెలంగాణ రాజకీయాలపై పట్టు సాధించాలని భావిస్తున్నారు.బీఆర్ఎస్‌లో ఇంతకముందు ఉన్నవారు కూడా టీడీపీ నుండి వెళ్లిన వారు.
అయితే చంద్రబాబు ఏపీలో అధికారంలోకి రాగా, ఇప్పుడు తెలంగాణపై పట్టు సారించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి తెలంగాణలో మరింత దారుణంగా మారింది. ఈ సమయంలో తెలంగాణలో బలపడేందుకు ఇదే సరైన సమయం అని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ కార్యకర్తలు టీడపీతోనే ఉండగా, మరి కొందరిని కూడా లాగేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. చూస్తుంటే చంద్రబాబు తన వ్యూహంతో మళ్లీ తెలంగాణలో అధికారం చేజిక్కించుకోనున్నారని కొందరు చెబుతున్నమాట.