Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. పవన్ బాధ్యతల్ని స్వీకరించి ఫైల్స్‌పై సంతకాలు చేశారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్‌కు అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో పవన్ కళ్యాణ్ తన మంత్రిత్వ శాఖలు అయిన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలు స్వీకరించారు. పవన్ కళ్యాణ్ తన తొలి సంతకాన్ని ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన వన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరుపై చేశారు.
రెండో సంతకాన్ని గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మాణానికి సంబంధించిన ఫైల్‌పై చేశారు. అనంతరం ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వివిధ అంశాలపైనా ఆయన చర్చించనున్నారు. బాధ్యతలు స్వీకరించే రోజే వరుస సమావేశాలతో పవన్ కల్యాణ్ బిజీగా ఉన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతికశాఖల్ని పవన్ కళ్యాణ్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆయన ఈ రోజు ఐఏఎస్, ఐపీఎస్ లతో కూడా ఈ రోజు మీటింగ్ పెట్టారు పవన్ కల్యాణ్.
అయితే పవన్ కళ్యాణ్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఆయన పక్కన ఓ బాక్స్ అందరి దృష్టిని ఆకర్షించింది.అందులో ఏముంది అని ప్రతి ఒక్కరు ఆరాలు తీస్తున్నారు. ఆ బాక్స్‌లో ఏదో విలువైనది ఉందని అందరు భావిస్తున్నారు.ఇక పవన్ వెంట ఆయనని కదిలించిన గొప్ప పుస్తకం ‘ఆధునిక మహాభారతం’ కూడా ఉంది.ఆ పుస్తకం చదివినప్పటి నుంచి తన వెంటే ఉంచుకుంటున్నారు. ఎక్కడికెళ్లిన తన వెంట తీసుకెళుతున్నారు. ఈ రోజు డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలను చేపట్టిన సమయంలో కూడా తన వద్ద పుస్తకం ఉంచుకున్నారు. . ఒక ‘దేశపు సంపద ఖనిజాలు కాదు. నదులు, అరణ్యాలు కాదు. కలలు ఖనిజాలతో చేసిన యువత. మన దేశ భవిష్యత్తుకు నావికులు అని మహాకవి శేషేంద్ర శర్మ మాటలు నన్ను అమితంగా ప్రభావితం చేశాయి అని’ పవన్ కల్యాణ్ రాశారు.