IPL 2024 : ఐపీఎల్ సీజన్ 17లో ఎవరు కప్ కొడతారు అనేది ఆసక్తికరంగా మారింది. మొదటి నుండి అద్భుతంగా ఆడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ఓడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడోసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో హైదరాబాద్ 36 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై విజయం సాధించింది. SRH 6 సంవత్సరాల తర్వాత ఈ లీగ్‌లో ఫైనల్‌కు చేరుకుంది. అంతకుముందు 2018లో ఆ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. మే 26న ఈ సీజన్ ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన సంజూ శాంసన్.. డ్యూ రాకపోవడం, పిచ్ పూర్తిగా మారిపోవడం తమ ఓటమిని శాసించిందని చెప్పాడు.
ఇదొక బిగ్ మ్యాచ్. మా బౌలింగ్ ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా. బ్యాటింగ్ వైఫల్యం మా ఓటమిని శాసించింది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో సన్‌రైజర్స స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు మా దగ్గర ఆప్షన్స్ లేవు. అదే మా పతనాన్ని శాసించింది. డ్యూ వస్తుందని మేం ఆశించాం. కానీ రాలేదు. ఇక మేం ఊహించిన విధంగా పిచ్ లేదు. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో పూర్తిగా మారిపోయింది. బంతి బాగా టర్న్ అయ్యింది. ఈ అడ్వాంటేజ్‌ను సన్‌రైజర్స్ స్పిన్నర్లు అద్భుతంగా వాడుకున్నారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో మా కుడి చేతి బ్యాటర్లను పెవిలియన్ చేర్చారు. అక్కడే ఆటలో పైచేయి సాధించారు అని చెప్పుకొచ్చాడు.ఇక అదే కాకుండా టోర్నీ మొత్తం అద్భుతంగా రాణించిన సంజూ శాంసన్, పరాగ్ డూ ఆర్ డై మ్యాచ్‌లో మాత్రం వీరిద్దరూ విఫలమయ్యారు. సంజు 11 బంతుల్లో కేవలం 10 పరుగులు చేయగా.. పరాగ్ 10 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ తరఫున రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ తన సొంతగడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. 4 ఓవర్లు వేసిన ఆశ్విన్ 43 పరుగులు సమర్పించారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ తన వ్యూహాన్ని పక్కాగా అమలు పరిచాడు. సరైన సమయంలో స్పిన్ బౌలర్లను రంగంలోకి దించారు. ఏ మాత్రం ఊహించని విధంగా ఈ సీజన్‌లో తొలిసారి అభిషేక్ శర్మతో బౌలింగ్ వేయించారు. . అభిషేక్ తన 4 ఓవర్ల స్పెల్‌లో కేవలం 24 పరుగులిచ్చి 2 పెద్ద వికెట్లు తీశాడు. కమిన్స్ ఇలాంటి వ్యూహాం అమలు చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఇక ఇది కాకుండా టామ్ కోహ్లర్-కాడ్మోర్‌కు రాజస్థాన్ మంచి అవకాశం ఇచ్చిన అతను చక్కగా వినియోగించుకోలేకపోయాడు. పవర్‌ప్లేలో వచ్చిన అతడు కేవలం 16 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేయగలిగాడు.