CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొన్నేళ్లుగా ఏపీ సీఎంగా ఉంటూ అనేక కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నాడు. తాను తరుచుగా పేదవాడినని చెబుతుంటారు. పెత్తందారులతో యుద్ధం చేస్తున్నానని, అందరూ ఈ పేదవాడివైపు నిలవాలంటూ పిలుపునిస్తుంటారు. తనకి ఫోన్ కూడా లేదని చెబుతుంటారు. అయితే వైఎస్ జగన్ కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకు వెళ్లారు. వాస్తవానికి ఇది వ్యక్తిగత పర్యటన అని చెబుతున్నారు. అటువంటప్పుడు ప్రభుత్వ నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు. కానీ ఆయన రక్షణ కోసం కోట్ల రూపాయలను ఖర్చుపెట్టాల్సి వస్తోంది. దాదాపు రెండువారాలు అక్కడే ఉండి జూన్ ఒకటిన తిరిగిరానున్నారు.
విస్టా జెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్ 7500 అనే అత్యంత విలాసవంతమైన విమానంలో జగన్ లండన్ వెళ్లారు. దాని ఖర్చు గంటకు రూ.12 లక్షలు. అంటే గంటకు రూ.12 లక్షలు ఖర్చుపెట్టే వ్యక్తి పేదవాడా? పెత్తందారా? అంటూ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లండన్ వెళ్లేందుకు బెయిల్ సమయంలో ఉన్న షరతుల్ని సడలించాలని కోరారు. విచారణ జరిపిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి సూచించగా.. జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అయితే కోర్టు విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో శుక్రవారం రాత్రి బయల్దేరి విదేశాలకు వెళ్లారు.. ఎన్నికల కౌంటింగ్‌కు ముందు మళ్లీ రాష్ట్రానికి తిరిగొస్తారు.
అయితే జగన్ లండన్‌లో సూటు బూటు వేసుకొని చాలా స్టైలిష్‌గా కనిపించారు బ్లూ జీన్స్, బ్లూ టీ షర్ట్ వేసుకున్న జగన్ పైన బ్లాక్ కోటు వేసి అదిరిపోయే లుక్‌లో కనిపించారు. జగన్‌ని ఇలా చూసి అందరు షాక్ అవుతున్నారు. హీరో లుక్‌లో కనిపిస్తున్నాడంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ లండన్ టూర్‌లో భాగంగా ఆయనిక రక్షణగా ఇప్పటికే నలుగురు అధికారులు లండన్ వెళ్లారు. వారికి విమాన టికెట్లు, వసతి, ఇతరత్రా ఖర్చులు కలిపి రూ.కోటిన్నర అవుతోంది. ఈ ఖర్చంతా ప్రభుత్వమే భరించాలి. సీఎం జగన్ వ్యక్తిగత పర్యటన కాబట్టి ఆయన వరకు ఆయన ఖర్చుపెట్టుకున్నా భద్రతా సిబ్బంది ఖర్చు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.