Udaya Bhanu : గల గలా మాట్లాడుతూ ప్రేక్షకులకి మంచి వినోదం పంచిన యాంకర్ ఉదయ భాను. టాప్ యాంకర్‌గా ఓ ఊపు ఊపిన ఉదయ భాను సినిమాలలో కూడా నటించింది. హీరోయిన్‌గాను, స్పెషల్ డ్యాన్స్‌లలోను అదరగొట్టింది. అయితే ఊహించని విధంగా ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇక ఇటీవల పలు షోలను హోస్ట్ చేయడమే కాక ఈవెంట్స్‌లోను హంగామా సృష్టిస్తుంది. అయితే ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 6లోకి అడుగుపెట్టనుందని కొన్నాళ్లుగా ప్రచారం నడుస్తూ వచ్చింది. భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఆమెను ఒప్పించారని కూడా వార్తలు వచ్చాయి.
కట్ చేస్తే ఇటీవల మొదలైన బిగ్ బాస్ 6లో ఉదయ భానుకి చోటు దక్కలేదు. అసలు ఉదయభాను ఎందుకు సైడ్ అయిపోయింది అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది. అయితే బిగ్ బాస్ లోకి ఆమె రావడానికి పెద్ద మొత్తంలోనే పేమెంట్ డిమాండ్ చేసిందట. ఆమె డిమాండ్ తో బిగ్ బాస్ మేకర్స్ కూడా ఖంగుతిన్నారట. అయినప్పటికీ ఆమెకు అడిగినంత ఇచ్చి తీసుకురావాలని నిర్వాహకులు భావించిన, నాగార్జున వలన ఉదయ భాను బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టలేకపోయిందనే వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఆమెకు ఆయనకు గతంలో ఉన్న విభేదాల వల్లనే నాగార్జున అడ్డుపడ్డట్టు ప్రచారం జరుగుతుంది.
అసలు బిగ్ బాస్ సీజన్ 6కి నాగార్జున హోస్ట్ గా చేయాల్సింది కాదట. వేరే స్టార్‌ని అనుకున్నారట. కానీ లాస్ట్ మూమెంట్‌లో ఆయన హ్యాండ్ ఇవ్వడంతో చివరకి నాగార్జుననే మళ్లీ బిగ్ బాస్ హోస్ట్‌గా మారాడట. ఇక అప్పటి విభేదాల వలన ఉదయ భానుని బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టకుండా చేశాడని కొందరు ప్రచారాలు చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. తన కెరీర్లో ఎన్నో సక్సెస్ ఫుల్ ప్రోగ్రామ్స్ ను హోస్ట్ చేసిన ఉదయ భాను.. ఆ తరువాత కొన్ని కాంట్రవర్సీస్ ను ఫేస్ చేసింది.