Actor Gowtham Raju : ప్రస్తుతం ఏపీలో విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ – జనసేన – బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైకాపా ఎమ్మెల్యేలు కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌లతో నరకం అనే పదానికి స్పెల్లింగ్ రాయిస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎమ్మెల్యే కురసాల కన్నబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ప్రజల కోసం బతకాలి అనే ఒక స్ఫూర్తి తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందన్నారు. కానీ, తమ వద్ద డొక్కు స్కూటర్‌పై తిరిగే కన్నబాబు ఇవాళ్ల పెద్ద నాయకుడు అయిపోయాడని మండిపడ్డారు. వెయ్యి కోట్ల రూపాయలకు ఆస్తి పరుడు అయ్యాడని చెప్పారు. తాను మాత్రం ఆశయం కోసం నిలబడి దశాబ్దకాలంగా నలిగిపోయానని చెప్పారు.
ప్రతి ఒక్క వెధవతో మాటలు అనిపించుకున్నాని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్న చిరంజీవి వల్లే కురసాల కన్నబాబు రాజకీయ నేత అయ్యాడని గుర్తు చేశాడు. చిరంజీవి పడేసిన భిక్షతో ఇవాల వైకాపా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడంటూ మండిపడ్డారు. నాడు చిరంజీవిని అవమానించారని, వాస్తవానికి అది నిర్మాతలకు సంబంధించిన విషయం అని అయినా చిరంజీవి ముందుకు వచ్చారని చెప్పారు. అయితే దానిపై కన్నాబాబు స్పందిస్తూ.. ఆయన నోటికొచ్చినట్టు తిట్టాడు. సంస్కారం అనేది ఈ పవన్ కల్యాణ్ కు లేదు అన్నట్టుగా మాట్లాడాడు. చిరంజీవి గారు పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఆయనతో చాలా క్లోజ్ గా పనిచేశాను. కానీ పవన్ కల్యాణ్ అనే వ్యక్తి నన్ను పోషించినట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు. అతడి దయాదాక్షిణ్యాలపై నేను బతికినట్టు, నాకేదో బతుకుదెరువు లేక ఇతడి వద్ద చేతులు కట్టుకుని నిలబడ్డట్టు మాట్లాడుతున్నాడు అని అన్నారు.
ఇక కమెడీయన్ గౌతంరాజు కూడా కన్నాబాబు విషయంలో పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. కన్నాబాబు గురించి కూడా పాజటివ్‌గా మాట్లాడుతూ.. ఆయన మంత్రి అయి ప్రజలకి సేవలు చేశారు. ఆయన మంత్రి అయి మరింత సేవలు చేస్తారు. మాయమాటలు చెప్పే వాళ్లని నమ్మోద్దు. ఉంచుకున్నది పోతది, అసలుది పోతది. దయచేసి నేను చెప్పినది విని మంచి వాళ్లని గెలిపించడం. జగన్‌ని గెలిపిస్తే మంచి లాభం కలుగుతుంది. వంగా గీత సంస్కారవంతురాలు.ఆమె ఎమ్మెల్యేగా మన దగ్గరకు వచ్చింది అంటే ఎంత సేవ చేయడానికి వచ్చిందో అర్ధం అవుతుంది. ఆమెని కూడా గెలిపించండి.