Undavalli Sridevi : ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారేది. వైసీపీలో ఉన్న శ్రీదేవి టీడీపీలో చేరతారా అనే అనుమనాలు అందరిలో ఉండేవి.రాజకీయాల్లో విశ్వసనీయత, విలువలు, నిజాయితీ అనేవి చాలా ప్రధానమైనవి. అవి లేని రోజు రాజకీయ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. స్వార్థంతో చేసే రాజకీయాలు కొంతకాలం వరకు హాయిగానే ఉంటాయి. కానీ కెరీర్ ను మాత్రం అంధకారంలోకి నెట్టేస్తాయి. నిజాయితీతో నాయకుడిని, ప్రజలను నమ్మి రాజకీయం చేసి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలానే తమ స్వార్థం కోసం ఆదరించిన పార్టీని మోసం చేసి.. రాజకీయంగా కనుమరుగైన వారు కూడా ఉన్నారు. వారిలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేరు వినిపిస్తోంది.
2019 వరకు ఎవరికీ అంతగా పరిచయం లేని పేరు. రాజధాని ప్రాంతమైన తాడికొండ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి.. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. హైదరాబాద్ లో వైద్య వృత్తిలో ఉన్న ఆమెను పిలిచి మరీ.. సీఎం జగన్.. ఆనాడు తాడికొండ సీటు ఇచ్చారు. అలా ఇవ్వడమే కాకుండా.. ఆమెను అక్కడి నుంచి గెలిపించి.. అసెంబ్లీకి పంపారు. టీడీపీ అమరావతిని రాజధానిగా ప్రకటించినా కూడా ఆ ప్రాంతంలో వైసీపీ విజయం సాధించింది. దీంతో ఉండవల్లి శ్రీదేవి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. ఇక తొలిసారి వచ్చిన అవకాశాన్ని ఎంతో చక్కగా ఉపయోగించుకోవాల్సిన శ్రీదేవి.. రాంగ్ స్టెప్ వేశారని వార్తలు వినిపించాయి.
తాడికొండ నియోజకవర్గంలో భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ శ్రీదేవిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాక నియోజకవర్గంలో ఆమెపై అసంతృప్తి ఎక్కువ కావడంతో.. 2024 ఎన్నికల్లో శ్రీదేవికి టికెట్ ఇవ్వమనే సంకేతాలు వైసీపీ అధిష్టానం ఇచ్చింది. దీంతో ఆమె.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థికి క్రాస్ ఓటు వేశారు. ఆ తర్వాత వైసీపీ అనర్హత వేటు వేయడంతో టీడీపీలో చేరారు. అప్పటి నుండి జగన్ ప్రభుత్వాన్ని విమర్శిచడంతో పాటు టీడీపీని పొగుడుతూ వచ్చింది. కుర్చీ మడత పెడతా అంటూ కూడా కామెంట్ చేసింది. అయితే ఆమెకి చంద్రబాబు కుర్చీ లేకుండా చేశారు. ఎంతో హోప్స్ పెట్టుకున్న ఆమెకి చివరికి సీటు దక్కలేదు. జగన్‌కి వెన్నుపోటు పొడిచిన ఆమెకి తగిన శాస్తి దక్కిందని కొందరు కామెంట్ చేస్తున్నారు.