Ranga Ranga Vaibhavanga : మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన చాలా మంది హీరోలు సక్సెస్‌తో దూసుకుపోతున్నారు. కొద్ది రోజుల క్రితం వైష్ణవ్ తేజ్ ఉప్పెన చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కాగా, ఈసినిమా మంచి హిట్ అందించింది. తర్వాత కొండపొలం అనే ప్రయోగాత్మక సినిమాలో కూడా హీరోగా నటించాడు. ఇక మూడో సినిమా రంగ రంగ వైభవంగా అనే సినిమా చేశాడు. తమిళ అర్జున్ రెడ్డి రీమేక్ సినిమాను తెరకెక్కించిన గిరీశాయ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. రొమాంటిక్ భామ కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నుంచి విడుదలైన కొన్ని పాటలు, ట్రైలర్, టీజర్ సినిమా మీద ఆసక్తి పెంచాయి. సెప్టెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సంపాదించింది.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. సినిమా టైటిల్స్‌లోనూ నెట్‌ఫ్లిక్స్‌కి క్రెడిట్స్ ఇవ్వడంతో చిత్రం ఈ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో విడుదల కానుందని భావిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ లో ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత ఇప్పుడు రంగ రంగ వైభవంగా సినిమా రాబోతుంది. అయితే ఇటీవల నిర్మాతలు ఓటీటీ విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టారు. సినిమా రిలీజ్ అయ్యాక 50 రోజులకి మాత్రమే ఓటీటీలో విడుదల చేయాలని రూల్స్ జారీ చేశారు. మరి నెట్‌ఫ్లిక్స్ నిర్మాతల మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళుతుందా లేదా అనేది చూడాలి.
ఈ సినిమాను మొదట జూలై 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు టీమ్ అయితే.. ఏవో కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమాకు గిరీశయ్య దర్శకుడు. ఇక ఈ చిత్రం నుంచి ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల రిలీజైన ట్రైలర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. దీనికి తోడు పాటలు మంచి ఆదరణ పొందాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణం వహించారు.