CM YS Jagan : ప్రస్తుతం ఏపీలో రాజకీయం చాలా వాడివేడిగా సాగుతుంది. భారతీయ జనతా పార్టీలో జగన్ కీలుబొమ్మగా మారారని సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిళ. ఏపీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు కానీ ఇక్కడ బీజేపీ రాజ్యం ఏలుతోందని వైఎస్ షర్మిల ఆరోపించారు. తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని, పార్టీని బీజేపీ వద్ద జగన్ తాకట్టు పెట్టాడని విరుచుకుపడ్డారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ విసృతస్థాయి సమావేశంలో షర్మిల మాట్లాడారు.జగన్ అన్న ప్రభుత్వంలో వ్యవసాయం దండగ అని షర్మిల విరుచుకుపడ్డారు. వైఎస్సార్ పథకాలు ఒక్కటి రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. ఇది రైతు రాజ్యం కాదు, వైఎస్సార్ సుపరిపాలన అంతకన్నా కాదని షర్మిల స్పష్టం చేశారు.జగన్ అన్న ప్రభుత్వంలో వ్యవసాయం దండగ అని షర్మిల విరుచుకుపడ్డారు. వైఎస్సార్ పథకాలు ఒక్కటి రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. ఇది రైతు రాజ్యం కాదు, వైఎస్సార్ సుపరిపాలన అంతకన్నా కాదని షర్మిల స్పష్టం చేశారు.
అయితే షర్మిళ చేస్తున్న కామెంట్స్‌పై జగన్ స్పందిస్తూ.. రాష్ట్రంలో తిరిగి తాము మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని సీఎం జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తన వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నామన్నారు. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకువచ్చామని.. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించామన్నారు. ఇండియా టుడే సదస్సులో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చామని.. తమ ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు నిదర్శనం ఇదేనన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుందని.. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుంది. అది ఆపార్టీ సంప్రదాయంగా చూస్తున్నాం. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారు. అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు. నేను కాంగ్రెస్‌నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్నకు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు. వారు పాఠాలు నేర్వేలేదు. వారి పార్టీ సారథ్య బాధ్యతలు మా సోదరికి ఇచ్చారు. కాని అధికారం అనేది దేవుడు ఇచ్చేది. దేవుడ్ని నేను బలంగా నమ్మతాను. ఆయనే అన్నీ చూస్తాడు..” అని సీఎం జగన్ అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుందని.. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని.. అలాగే తమ కుటుంబాన్ని కూడా విభజించారని అన్నారు.