Prabhas : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అత్యంత సుందరంగా నిర్మించిన రామమందిరాన్ని.. ఈ నెల 22న ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే.. జనవరి 22న జరిగే కార్యక్రమం కోసం దేశ, విదేశాల్లోని 7వేల మందికి ఆహ్వానాలు పంపినట్టు సమాచారం. ఇందులోని 6వేల ఆహ్వాన పత్రికలు ఇప్పటికే అథిథులకు చేరుకున్నట్టు సమాచారం. రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వాన పత్రిక అందుకున్న వారిలో ప్రముఖ నటులు చిరంజీవి, ప్రభాస్ కూడా ఉన్నారు. రాజకీయ నేతల నుంచి సెలబ్రిటీల వరకు.. ఆహ్వానం అందుకున్న వారిలో మన తెలుగు ఇండస్ట్రీ నుండి ఇద్దరు హీరోలు ఉండడం విశేషం.
టాలీవుడ్ లో చిరంజీవికి ప్రత్యేక స్థానం. ప్రభాస్ ఫ్యామిలీ మొదట్నుంచి బీజేపీ పార్టీలోనే ఉంది. అదిపురుష్ సినిమా చేసిన ప్రభాస్ కు రాముడి ఆలయం ప్రారంభోత్సవ వేళ ఆహ్వానించాలని నిర్ణయించారు. టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, నితిన్, నిఖిల్ తోనూ బీజేపీ నేతలు సన్నిహితంగా ఉంటున్నారు. అదే విధంగా రాజకీయంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. వీరి ఆహ్వానం విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. తమిళం నుంచి సూపర్ స్టార్ రజనీ, ధనుష్‌లకు ఆహ్వానం అందింది. కన్నడ నుంచి కేజీఎఫ్ స్టార్ యష్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టిలకు ఆహ్వానం అందిందట. మరోవైపు మలయాళం నంచి మోహన్‌లాల్‌ను ఆహ్వానించారు.
అయితే ప్రభాస్‌కి ఆహ్వానం అందడం ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విషయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆయనకి ఉన్న బిజీ షెడ్యూల్‌లో ప్రబాస్ ఖాళీ చేసుకొని మరీ అక్కడికి వెళ్లనుండడం గొప్ప విషయం అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి ప్రభాస్ గురించి ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది అని చెప్పాలి.
https://youtube.com/watch?v=L8kdwLGhVFo