Amrapali : తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి గత నెల ఏడోతేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రగతి భవన్ లో ప్రజాదర్బార్ నిర్వహిస్తుండడం, ఆయనని ప్రజలు నేరుగా కలుస్తున్నారు. అలాగే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వరుసపెట్టి ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అధికారుల మార్పులు చేర్పులు చక చక జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు అధికారుల్ని బదిలీ చేస్తూ… ఆదేశాలు జారీ చేశాయి, ఐఏఎస్‌ల బదిలీలు కూడా జరిగాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పేషీలో కూడా కొత్త అధికారులు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇక కొద్ది రోజుల క్రితం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రోజుకు 18 గంటలు పని చేయాలని సూచించారు. అలా పని చేయడం కుదరదనుకుంటే బాధ్యతల నుంచి తప్పుకోవాలన్నారు. పనిచేయడం ఇష్టం లేని వాళ్లు సీఎస్, డీజీపీకి చెప్పి బాధ్యతల నుంచి తప్పుకోవాలన్నారు. బాధ్యత తీసుకుంటే పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉన్నంత వరకే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు.
ఇక తెలంగాణ ఐఎస్ అధికారుల సంఘం క్లబ్‌లో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. బేగంపేటలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వేడుకకు హాజరైన అధికారులను సీఎం పేరుపేరునా పలకరించారు. అందరితో నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. సీఎం దంపతులను సంఘం అధ్యక్షుడు శశాంక్ గోయల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు ఐఏఎస్ అధికారులు తమ కుటుంబ సభ్యులతో సీఎం దంపతులను కలిశారు. అందమైన ఐఏఎస్ ఆఫీసర్ అమ్రపాలి కూడా కనిపించడంతో ఆమెని చూసి నవ్వడంతో పాటు సర్‌ప్రైజ్ రియాక్షన్ ఇచ్చారు.