Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి అందరికీ తెలిసిందే. ఈయన సోషల్ మీడియా ద్వారా అందరికీ పరిచయం అయ్యారు. ఈయన ఎక్కువగా సెలబ్రిటీలకు జాతకాలు చెబుతుంటారు. గతంలో ఆయన చెప్పిన చాలా వరకు జాతకాలు, జ్యోతిష్యాలు నిజం అయ్యాయి కూడా. అందుకనే ఆయన జ్యోతిష్యంపై చాలా మందికి మంచి గురి ఏర్పడింది. అప్పట్లో వేణు స్వామి.. సమంత, చైతూల జాతకం చెప్పారు. వారు విడిపోతారని అన్నారు. అలాగే జరిగింది. అలాగే జగన్ సీఎం అవుతారని అన్నారు. అది కూడా జరిగింది. ఇలా ఎన్నో సార్లు ఆయన చెప్పిన జాతకాలు నిజం అయ్యాయి. అయితే తాజాగా మరోమారు ఆయన పవన్‌పై సంచలన కామెంట్స్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకుంటారని వేణు స్వామి చెప్పారు. 2024లో పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శల పాలవుతారని అన్నారు. అంటే వచ్చే మే నెలలో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి కదా.. వాటిల్లో ఆయన ఓడిపోతారని, విమర్శల పాలవుతారని వేణు స్వామి చూచాయగా చెప్పారు. అయితే సినిమా రంగంలో మాత్రం పవన్‌కు అద్భుతమైన భవిష్యత్తు ఉందని అన్నారు. కానీ ఇతర రంగాల్లో పవన్ రాణించలేరని చెప్పారు. ఇక పవన్ రాజకీయాలు చేస్తూ తన పేరును అనవసరంగా నాశనం చేసుకుంటున్నాడని, ఆయన ముఖ్యమంత్రి కావాలని తనకు కూడా ఉందని, కానీ ఆయన కల నెరవేరదని తెలిపారు.
![Venu Swamy : పవన్ మళ్లీ విడాకులు తీసుకోవడం ఖాయం.. వేణు స్వామి సంచలన కామెంట్స్.. Venu Swamy told that pawan kalyan will take 3rd time divorce](http://3.0.182.119/wp-content/uploads/2024/01/venu-swamy.jpg)
ఇక ఈ ఏడాది జూలై అనంతరం పవన్ తన మూడో భార్యకు విడాకులు ఇస్తారని వేణు స్వామి సంచలన కామెంట్స చేశారు. ఎన్నికలు అయ్యాక తన భార్య అన్నా లెజినివాకు విడాకులు ఇస్తారని అన్నారు. అయితే త్రివిక్రమ్ చెబితే పవన్ వింటాడని, కానీ పవన్ వ్యక్తిగత విషయాల్లో మాత్రం త్రివిక్రమ్ జోక్యం చేసుకోడని అన్నారు. అయితే వేణు స్వామి వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్, జన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చెప్పే జాతకాలు ఏమాత్రం నిజం కావని, పవన్ సీఎం అవుతారని వారు ధీమా వ్యక్తం చేశారు.
కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ముచ్చటగా మూడోసారి గెలిచి మళ్లీ సీఎం అవుతారని, అలాగే ప్రభాస్ నటించిన సలార్ మూవీ కూడా నిరాశనే మిగులుస్తుందని, దీంతో ప్రభాస్ కెరీర్ పడిపోతుందని కూడా రెండు సార్లు వేణు స్వామి జ్యోతిష్యం చెప్పారు. కానీ అవేవీ నిజం కాదు. దీంతో ఆయన ఈమధ్య విమర్శలపాలవుతున్నారు. మరి ఇప్పుడు పవన్ విషయంలో ఆయన చెబుతున్న జాతకం ఎంత వరకు నిజం అవుతుందో వేచి చూస్తే తెలుస్తుంది.