YS Bharati : ఏపీ సీఎం జగన్ ప్రస్తుతం రాజకీయాలలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. మరోసారి ఆయన అధికారం దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని విషయాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ ముందుకు సాగుతున్నారు.అయితే ఇటీవల క్రిస్మస్ వేడుకలలో జగన్, ఆయన సతీమణి భారతి పాల్గొన్నారు. వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటించారు. పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రార్థనల అనంతరం సీఎం జగన్, వైఎస్ విజయమ్మ కేక్ కట్ చేశారు.
2024 చర్చి క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ప్రతి ఏడాది ఈ క్రిస్మస్ పర్వదినం రోజున తన సొంత గడ్డపై కుటుంబ సభ్యులు, బందుగణం, స్నేహితులతో.. కలిసి పండుగ వేడుకలో పాల్గొనడం తన మనసుకు ఎంతో ఆనందాన్నిచ్చిందని సంతోషం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సొంత ఊరిలో.. అందరితో కలిసి క్రిస్మస్ ప్రార్థనలు చేయడం తనకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తినిచ్చిందన్నారు. అలాగే అందరి అభిమానం, ఆశీస్సులు, దేవుని చల్లని దీవెనలే తనకు ఎల్లవేళలా అందాలని కోరుకుంటున్నానని ప్రార్థించారు సీఎం జగన్.
అయితే వేడుకలలో జగన్ భార్య భారతి ఎలాంటి గర్వం లేకుండా అందరిని ప్రేమగా పలకరించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారతున్నాయి. బారతమ్మ ఓపికమ్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే వైఎస్ భారతి నేరుగా రాజకీయాల్లోకి వస్తున్నారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సాధారణంగా వైఎస్ భారతి రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. సీఎం భార్య గానే ఆమె పేరు అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. సీఎం గవర్నర్ తో రాజ్ భవన్ కి వెళ్ళినపుడు ఉగాది వంటి వేడుకలలో తన భార్యను వెంట తీసుకువస్తారు. ఆమె ఒక సాధారణ గృహిణి మాత్రమే. అలాంటి వైఎస్ భారతి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా అన్నది వైసీపీలో చర్చ జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ భార్య వైఎస్ భారతి పోటీ చేస్తారన్న ప్రచారం కడప జిల్లా లోనే ఎక్కువగా జరుగుతోంది.