ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్.. పిక్సల్ సిరీస్‌లో పిక్సల్ 6ఎ పేరిట ఓ నూతన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.1 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ స్క్రీన్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. అలాగే గూగుల్ టెన్సార్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. దీనికి టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్ లభిస్తోంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లో ఈ ఫోన్ విడుదలైంది.
ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. వెనుక వైపు 12.2 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు మరో 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను అమర్చారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇందులో లభిస్తుంది. ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను ఇందులో అందిస్తున్నారు. అలాగే 5జి, 4జీవీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.2 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ వంటి ఇతర ఫీచర్లు ఈ ఫోన్‌లో లభిస్తున్నాయి. ఇక ఈ ఫోన్ లో 4410 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ లభిస్తోంది.
గూగుల్ పిక్సల్ 6ఎ స్మార్ట్ ఫోన్ చార్ కోల్, చాక్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ.43,999గా ఉంది. ఈ ఫోన్‌కు గాను ప్రీ ఆర్డర్లను గురువారం నుంచే ప్రారంభించారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ ఫోన్ ను ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తారు. యాక్సిస్ బ్యాంక్ కార్డులు ఉన్నవారు ఈ ఫోన్‌పై రూ.4వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ పై కూడా ఈ ఆఫర్ లభిస్తుంది. ఇతర ఏదైనా పిక్సల్ డివైస్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.6వేల అదనపు డిస్కౌంట్ ఇస్తారు. ఇతర స్మార్ట్ ఫోన్లు అయితే రూ.2వేల డిస్కౌంట్ ఇస్తారు. ఇక ఈ ఫోన్‌తో గూగుల్ నెస్ట్ హబ్ జెన్ 2, పిక్సల్ బడ్స్ ఎ సిరీస్, ఫిట్ బిట్ ఇన్‌స్పైర్ 2 వంటి డివైస్‌లను రూ.4,999 ధరలకు కొనవచ్చు. అలాగే ఈ ఫోన్‌పై 3 నెలల పాటు ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం, గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్లు లభిస్తాయి.