Chandra Babu : గత కొద్ది రోజులుగా బర్రెలక్క పేరు నెట్టింట తెగ హాట్ టాపిక్ అవుతుంది. తెలంగాణ ఎన్నికల్లో ఏదైనా సెన్షేషన్ ఉందంటే అది బర్రెలక్క పోటీ మాత్రమే. చదువుకున్నప్పటికీ ఉద్యోగం రాక, బర్రెలు కాసుకుని తన అనుభవాలను రీల్స్ రూపంలో షేర్ చేస్తూ ఫేమస్ అయిన శిరీష అలియాస్ బర్రెలక్క కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగి హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆమె నిర్ణయాన్ని కొనియాడిన ఎంతోమంది ఆమెకు మద్దతుగా తరలివస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. సొంత ఖర్చులతో ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతూ జనాల్లోకి తీసుకెళ్తున్నారు. కొల్లాపూర్‌లో ఇప్పుడామె పేరు మార్మోగిపోతోంది.
కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండలం వెనచర్లలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క తన మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఆమె తమ్ముడిపై దుండగులు దాడి చేశారు. తన తమ్ముడిపై ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని బర్రెలక్క కన్నీటిపర్యంతమయ్యారు. తమకు ప్రజల మద్దతు పెరగడంతో ఓట్లు చీలిపోతాయని ప్రత్యర్థులు ఇలా దాడులు చేయించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. తన తమ్ముడిపై దాడి చేసి గాయపపర్చడం దుర్మార్గమంటూ భోరున విలపించారు.
బర్రెలక్క దాడి సంఘటన జరిగిన తర్వాత ఆమెకి మద్దతు మరింత పెరుగుతుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఆమెకి తమదైన సపోర్ట్ అందిస్తున్నారు. రీసెంట్‌గా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ అరాచకం ఎక్కువైందని, ఆయనకి కొందరు గట్టి పోటీ ఇస్తున్నారు.ఎవరి సపోర్ట్ లేకుండా గర్జిస్తున్న బర్రెలక్కని ప్రశంసిస్తూ ఆమెకి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా తనతో పాటు పవన్ కళ్యాణ్ సపోర్ట్ అందిస్తామంటూ చంద్రబాబు పరోక్షంగా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.