Kane Williamson : ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీకి తెరపడనుంది. అయితే నవంబర్ 15న భారత్- న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్ జరగగా, ఈ మ్యాచ్‌లో భారత్ మంచి విజయం సాధించింది. అయితే సెమీస్ లో టీం ఇండియా పైన తుది వరకు పోరాడి ఓడిన న్యూజీలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఫైనల్ మ్యాచ్ పైన తన అంచనాలు వెల్లడించారు. సెమీస్ లో టీం ఇండియా ఆట తీరును ప్రశంసించారు. ఫైనల్ లో ఎవరిదో పై చేయి స్పష్టం చేసారు. ప్రస్తుతం టీమిండియా ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు అని విలియమ్సన్ తెలియజేశాడు. కోహ్లీ, శ్రేయాస్, షమీ ప్రదర్శన ఈ మ్యాచ్ లో బాగుందని అందుకే ఓడామని అన్నారు.
భారత్ ఆటగాళ్ల ప్రదర్శన చూస్తుంటే ఫైనల్లో ఆపడం ఏ జట్టుకైనా కష్టతరమేనని అర్ధమవుతుంది. భారత ఆటగాళ్లు అత్యుత్తమ క్రికెట్ ఆడుతున్నారని, ఒక్క ఓటమి కూడా లేకుండా చెలరేగుతున్న ఆతిథ్య జట్టుని ఫైనల్లో ఆపడం అంత ఈజీ అయితే కాదు. సాధారణంగా వైఫల్యాలు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో ఎలా వ్యవహరిస్తామనేది ముఖ్యం. కానీ టీమిండియా ఈ టోర్నీలో నిజంగా అద్భుతంగా ఆడుతోంది. కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీఫైనల్ చేరుకున్నారు. రౌండ్-రాబిన్ ప్రతి మ్యాచ్‌లోనూ అదరగొట్టారు. సెమీఫైనల్లోనూ అదే చేశారు. ఆత్మవిశ్వాసంతో ఫైనల్‌కు వెళ్లారనడంలో ఎలాంటి సందేహం లేదు..” అంటూ వ్యాఖ్యానించాడు.
ఆత్మవిశ్వాసంతో భారత జట్టు ఫైనల్‌కు వెళ్లారనడంలో ఎలాంటి సందేహం లేదని విలయమ్సన్ అన్నారు. సెమీ-ఫైనల్‌లో టీమిండియా గెలుపు త్వర్వాత కేన్ విలియమ్సన్ ఈ వ్యాఖ్యలు చేసారు విలియమ్సన్ . అయితే ఫైనల్ కు భారత్ ప్రత్యర్ధి ఎవరైనా రోహిత్ సేనను అడ్డుకోవటం కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేసారు. కాగా, ప్రతి మ్యాచ్‌లో కూడా రోహిత్ ఎదురు దాడి చేస్తూ బౌలర్ల ఆత్మవిశ్వాసం దెబ్బ తీస్తున్నాడు. ఈ క్రమంలోనే మిగతా బ్యాటర్స్‌పై అంత ప్రెషర్ పడడం లేదు. సులువుగా పరుగులు రాబడుతున్నారు.