Viv Richards : వన్డే వరల్డ్ కప్ 2023 తుది దశకు చేరుకుంది. ఆక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కాగా, ఈ ఈవెంట్‌లో మొత్తంగా 10 జట్లు పాల్గొన్నాయి. ప్రతి టీం కూడా తొమ్మిది మ్యాచ్‌లు ఆడింది. అయితే భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌లలో ఒక్కటి కూడా ఓడిపోలేదు. తొమ్మిది మ్యాచ్‌లకి గాను తొమ్మిది విజయాలు సాధించి జయహో అనిపించింది. అయితే ఇప్పుడు సెమీస్ దశకు చేరుకుంది. ఈ సెమీస్ కూడా విజయం సాధించి భారత్ ఫైనల్ చేరుకొని కప్ కొడుతుందని మాజీ క్రికెటర్ రిచర్డ్స్ అన్నారు. 1975 మరియు 1979లో వెస్టిండీస్ ప్రపంచ కప్ విజయాలలో ముఖ్య పాత్ర పోషించిన రిచర్డ్స్.. భారత జట్టు తమ శక్తి మేరకు ఆడటం కొనసాగించాలని మరియు వారు ఈ సారి కప్ కొడతారని అన్నాడు.
భారత జట్టు విజయంలో కోహ్లీ ముఖ్య పాత్ర పోషిస్తాడని ఆయన ఎలాంటి ఒత్తిడినైన ఎదుర్కొని బ్యాటింగ్ చేస్తాడని తెలిపాడు. కోహ్లీ ఉన్నంత సేపు భారత్‌కి ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేశాడు. వ్యక్తిగతంగా కోహ్లీ నా ఫేవరేట్ క్రికెటర్.. అతనిపై ఒకానొక సమయంలో ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చిన కూడా అవన్నీ తట్టుకొని నిలిచాడు. ఈ సారి ఆయన భారత్‌ని తప్పక ఛాంపియన్‌గా నిలబెడతాడని రిచర్డ్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక భారత్ నవంబర్ 15 న న్యూజిలాండ్‌తో సెమీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే 19న ఫైనల్ ఆడనుంది.
ఇక వన్డే వరల్డ్ కప్ 2023కి సంబంధించిన ప్రైజ్‌మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇప్పటికే ప్రకటించింది. మొత్తం ప్రైజ్ మనీ రికార్డు స్థాయిలో 10 మిలియన్ డాలర్లుగా ఖరారు చేసింది. అంటే భారత కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ. 83 కోట్లుగా ఉంది. ప్రైజ్ మనీ మొత్తాన్ని విన్నర్, రన్నర్, సెమీఫైనలిస్టులు, గ్రూప్ స్జేజ్‌లో వెనుదిరిగిన జట్లు పంచుకోనున్నాయి. ఇందులో సింహ భాగం విన్నర్‌కే దక్కనుంది. వరల్డ్ కప్ టైటిల్ విన్నర్‌కు రూ. 33 కోట్లు దక్కనున్నాయి. ఫైనల్‌లో ఓడిన జట్టు రూ. 16.58 కోట్లు చేజిక్కించుకోనుంది.